- Advertisement -
సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు బంగారు బోనం సమర్పించారు. ఆదివారం ఉజ్జయిని మహంకాళి బోనాలు ఘనంగా ప్రారంభమయ్యాయి.బోనాల పండుగ సందర్భంగా మహంకాళి అమ్మవారిని సిఎం కెసిఆర్ దంపతులు దర్శించుకునేందుకున్నారు. అమ్మవారికి సిఎం దంపతులు బోనంతోపాటు పట్టు వస్త్రాలు సమర్పించారు. అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో సిఎం కెసిఆర్ తోపాటు మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, ఇంద్రకరణ్ రెడ్డి పాల్గొన్నారు. కాగా, మహంకాళి అమ్మవారి బోనాల పండుగ నేపథ్యంలో పెద్ద ఎత్తున భక్తులు ఆలయానికి చేరుకుంటున్నారు. తెల్లవారుజాము నుంచే అమ్మవారికి బోనాలు సమర్పిస్తున్నారు.
Also Read: సాయిచంద్ దశ దినకర్మకు హాజరైన సిఎం కెసిఆర్..
- Advertisement -