Monday, December 23, 2024

సర్వాయి పాపన్న తెలంగాణ వీరత్వానికి ప్రతీక: సిఎం కెసిఆర్

- Advertisement -
- Advertisement -

CM KCR on Sardar Sarvai Papanna

హైదరాబాద్: సర్వాయి పాపన్న తెలంగాణ వీరత్వానికి, పరాక్రమానికి ప్రతీకని ముఖ్యమంత్రి కెసిఆర్ అన్నారు. పాపన్న జయంతి సందర్భంగా సిఎం ఆయనను స్మరించుకున్నారు. నిరంకుశ పోకడలకు వ్యతిరేకంగా పాపన్న పోరాడిన తీరు గొప్పదని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. సర్వాయి పాపన్న జయంతి ఉత్సవాలను, తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తూ బడుగు బలహీన వర్గాల నాయకత్వాన్ని సముచితంగా గౌరవిస్తోందని కెసిఆర్ తెలిపారు. అణచివేత, వివక్షకు వ్యతిరేకంగా పాపన్న ప్రదర్శించిన ఆత్మగౌరవ పోరాట స్ఫూర్తిని తెలంగాణ రాష్ట్రం కొనసాగిస్తోందని సిఎం కెసిఆర్ పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News