- Advertisement -
హైదరాబాద్: యాసంగిలో మొక్కజొన్న పంటను మద్దతు ధరలకు కొనుగోలు చేయాలని ముఖ్యమంత్రి కేసిఆర్ ఆదేశాలు ఇచ్చారని వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి తెలిపారు. రాష్ట్రంలో యాసంగి పంట కింద సుమారు 6.50లక్షల ఎకరాలలో మొక్కజొన్న పంట సాగులోకి వచ్చిందన్నారు. సుమారు 17.37లక్షల మెట్రిక్ టన్నుల మేరకు పంట దిగుబడి లభించే అవకాశాలు ఉన్నట్టు అంచనా ఉందన్నారు.
ప్రధానంగా ఈ పంట ఉమ్మడి వరంగల్ ,అదిలాబాద్, ఖమ్మం, కరీనగర్ జిల్లాలలో అధికంగా సాగులోకి వచ్చిందని తెలిపారు. మొక్కజొన్న పంటకు ప్రభుత్వం క్వింటాలుకు రూ.1962 కనీస మద్దతు ధర అమలు చేస్తుందని తెలిపారు. రాష్ట్రంలో రైతుల నుంచి మొక్కజొన్న పంట కొనుగోలుకు వెంటనే అవసరమైన చోట కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని అధికారులకు ఆదేశాలిచ్చామని మంత్రి నిరంజన్‌రెడ్డి పేర్కొన్నారు.
- Advertisement -