Monday, December 23, 2024

రుణమాఫీ కోసం రూ. 18,241 కోట్ల బడ్జెట్ ఆర్ధిక శాఖ విడుదల

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్ : రైతు రుణమాఫీలో రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక ముందడుగు వేసింది. అన్నదాతలను ఆర్థికంగా మరింత బలోపేతం చేసే లక్ష్యంతో రైతు సంక్షేమం కోసం నిరంతరం తపించే సీఎం కేసీఆర్ రైతు రుణమాఫీకి శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా గురువారం పూర్తి రుణమాఫీకి సంబంధించి రూ.18,241 కోట్లకు ఆర్థిక శాఖ బడ్జెట్ రిలీజ్ ఆర్డర్ (బీఆర్వో) విడుదల చేసింది. మొదటి విడతలో భాగంగా రూ.37 వేల నుండి రూ.41 వేల మధ్యన ఉన్న రైతు రుణాలను మాఫీ చేసేందుకు ఆర్థికశాఖ రూ.237.85 కోట్లు విడుదల చేసింది. దీంతో ద్వారా 62,758 మంది రైతులకు లబ్దిచేకూరనుందని ఆర్దిక శాఖ మంత్రి హరీశ్‌రావు ట్విట్టర్ పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News