Thursday, December 26, 2024

‘మహా’ విస్తరణపై స్పెషల్ ఫోకస్

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్ : దేశ రాజకీయాలపై దృష్టి సారించిన బిఆర్‌ఎస్ అధినేత కెసిఆర్.. వివిధ రాష్ట్రాల్లో పార్టీ విస్తరణపై దృ ష్టి సారించారు. ఇందులో భాగంగానే మహారాష్ట్రలో ఇప్పటికే నిర్వహించిన మూడు భారీ బహిరంగ సభలకు ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోంది. వివిధ పార్టీలకు చెందిన మ హారాష్ట్ర నాయకులు, కార్యకర్తలు బిఆర్‌ఎస్ లోచేరేందుకు క్యూ కడుతున్నారు.ఈ నేపథ్యం లో సిఎం కెసిఆర్ మహారాష్ట్రపై స్పెషల్ ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. త్వరలోనే షో లాపూర్, నాగ్‌పూర్, చంద్రాపూర్‌లో సభలు నిర్వహించేందుకు బిఆర్‌ఎస్ అధినేత సమాయత్తమవుతున్నట్లు సమాచారం. మహారాష్ట్ర లో బిఆర్‌ఎస్ పార్టీని విస్తరణ ప్రారంభమైం ది. రోజురోజుకు మహారాష్ట్రలోని వివిధ జిల్లాలకు చెందిన వివిధ పార్టీల నాయకులు, కార్యకర్తలు బిఆర్‌ఎస్ పార్టీలో చేరుతున్నారు. తెలంగాణకు ఆనుకుని ఉన్న నాందేడ్ నుంచి మొదలుపెట్టి.. మరఠ్వాడాను ప్రభావితం చే సేందుకు బిఆర్‌ఎస్ ప్రయత్నిస్తున్నారు.

మహారాష్ట్రలో ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, ప్రత్యర్థి పార్టీకి ఉన్న పరిధిని దృష్టిలో ఉంచుకుని అక్కడి సమస్యలపై బిఆర్‌ఎస్ పార్టీ దృష్టి సారిస్తోంది. తెలంగాణ మోడల్‌ను వివరిస్తూ మహారాష్ట్రలోని సమస్యలు పరిష్కరిస్తామని వి వరిస్తోంది. ముఖ్యంగా తాగునీరు, సాగునీ రు, ఉచిత విద్యుత్, రైతుబంధు, రైతుబీమా, దళితబంధు, కళ్యాణలక్ష్మి వంటి పథకాల ద్వారా మహారాష్ట్ర ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలకు శాశ్వత పరిష్కారం తెస్తామని బిఆర్‌ఎస్ ప్రజల్లో విశ్వాసం కల్పిస్తోంది. తెలంగాణకు సమీప భాగం మరఠ్వాడాలోని నాందేడ్ జిల్లాలో ఉంది. తెలంగాణలో జరిగిన అభివృద్ధి పనులను అక్కడి పౌరులు గమనిస్తున్నారు. అందుకే ముందుగా నాందేడ్‌లో బహిరంగ సభ నిర్వహించినట్లు తెలిసింది. మరఠ్వాడాలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు.. ఒకప్పుడు తెలంగాణలో రైతులు ఎదుర్కొన్న సమస్యలు దాదాపు ఒకేలా ఉన్నాయి. తద్వారా ఇక్కడి రైతులకు అందుతున్న సౌకర్యాలు మనమూ పొందగలం అనే భావన మరఠ్వాడా రైతుల్లో ఉండటంతో అక్కడ బిఆర్‌ఎస్‌కు మంచి స్పందన లభిస్తోంది.

నలుగురు ఎంఎల్‌ఎల నిఘా

మహారాష్ట్రలో బిఆర్‌ఎస్ పార్టీ బలోపేతం కోసం ఎంఎల్‌ఎలు జీవన్ రెడ్డి, ప్రభుత్వ విప్ బాల్క సుమన్, జోగు రామన్న, హనుమంతు షిండేలు ఇప్పటికే మరఠ్వాడాపై నిఘా ఉంచారు. నాందేడ్‌తో సహా తెలంగాణ సరిహద్దులో గల మహారాష్ట్రలోని అనేక గ్రామాల ప్రజలు తెలంగాణలో అమలవుతున్న పథకాలు, సౌకర్యాలకు ఆకర్షితులయ్యాయి. ఈ క్రమంలోనే అక్కడి కొన్ని గ్రామాలు తమ ఊళ్లనూ తెలంగాణలో చేర్చాలంటూ గతంలో డిమాండ్ చేశాయి. సోమవారం మహారాష్ట్రలోని ఔరంగాబాద్ జబిందా మైదానంలో భారత్ రాష్ట్ర సమితి భారీ బహిరంగ సభకు విశేష స్పందన లభించింది. ఈ సందర్భంగా పలువురు కీలక మరాఠా నేతలు ముఖ్యమంత్రి కెసిఆర్ సమక్షంలో బిఆర్‌ఎస్ పార్టీలో చేరారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News