Monday, December 23, 2024

ప్రైవేటు ఆస్పత్రుల దోపిడి నుంచి పేదలను కాపాడుతున్నాం: సిఎం కెసిఆర్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ప్రైవేటు ఆస్పత్రుల దోపిడి నుంచి పేదలను కాపాడుతున్నామని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అన్నారు. శుక్రవారం ప్రగతి భనవ్ నుంచి వర్చువల్ గా పలు జిల్లాల్లో నిర్మించిన 9 మెడికల్ కాలేజీలను సిఎం కెసిఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా సిఎం కెసిఆర్ మాట్లాడుతూ.. “వైద్య, ఆరోగ్య రంగంలో దిగ్విజయంగా మార్పులు తీసుకొచ్చాం. ఒకేసారి 9 వైద్య కాలేజీలు ప్రారంభిచడం శుభపరిణామం. ప్రతి జిల్లాకో మెడికల్ కాలేజ్ ఏర్పాటు చేసుకున్నాం. ప్రస్తుతం 26 జిల్లాల్లో మెడికల్ కాలేజీలు ఏర్పాటయ్యాయి. వచ్చే ఏడాది మరో 8 మెడికల్ కాలేజీలు అందుబాటులోకి వస్తాయి. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో మూడు మెడికల్ కాలేజీలు వచ్చాయి. 85 శాతం మెడికల్ సీట్లు స్థానిక విద్యార్థులకే ఇస్తున్నాం. ప్రస్తుతం 8115 సీట్లు అందుబాటులోకి వచ్చాయి.తెలంగాణలో ఏడాదికి 10 వేల మంది డాక్టర్లు తయారవుతున్నారు.

మంత్రి హరీశ్ రావు నేతృత్వంలో వైద్య, ఆరోగ్య రంగంలో ఎన్నో విప్లవాలు తీసుకొచ్చాం. ఆదివాసీ జిల్లాల్లోనూ వైద్య విఫ్లవం తీసుకువచ్చాం. దేశానికి తెల్లకోటు డాక్టర్లు కూడా ఎంతో అవసరం. సిటీలో మరో నాలుగు టిమ్స్ ఆస్పత్రులను నిర్మించుకుంటున్నాం. ఆస్పత్రులు, కాలేజీలే కాదు వైద్య రంగాన్ని మరింత పటిష్టం చేస్తాం. కరోనా లాంటి ఎన్ని మహమ్మారిలు వచ్చినా ఎదుర్కొంటాం. పేద గర్భిణులకు కెసిఆర్ కిట్లు, న్యూట్రిన్ కిట్లు అందిస్తున్నాం. అమ్మఒడి వాహనాలతో గర్భిణీలకు మెరుగైన సేవలు అందిస్తున్నాం. మాతా, శిశు మరణాలు తగ్గించేందుకు చర్యలు తీసుకొన్నాం. ప్రభుత్వ ఆస్పత్రుల్లో 76 శాతం ప్రసవాలు జరుగుతున్నాయి. 2014 తర్వాత ప్రభుత్వ ఆస్పత్రుల్లో 34 వేల పడకలు అందుబాటులోకి వచ్చాయి. రాష్ట్రంలో 10 వేల సూపర్ స్పాలిటీ బెడ్స్ అందుబాటులోకి తీసుకొస్తాం. ప్రతి లక్ష జనాభాకు 22 మెడికల్ సీట్లు ఉన్న ఏకైక రాష్ట్రం తెలంగాణ. 500 టన్నుల ఆక్సిజన్ ను ఉత్పత్తి చేసే సామర్థ్యం రాష్ట్రానికి ఉంది” అని పేర్కొన్నారు.

Also Read: పటాన్ చెరులో విషాదం.. టెట్ పరీక్ష రాసేందుకు వచ్చి గర్భిణి మృతి..

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News