మన తెలంగాణ/ మహబూబ్‌నగర్ బ్యూరో: పొరపాటున ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిస్తే కర్నాటక గతే పడుతుందని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావు అన్నారు. రైతుబంధు కు రాంరాం, దళిత బంధుకు జైభీమ్ చెబుతుందని.. 24 గంటల కరెంట్ కాటకలుస్తుందని హెచ్చరించారు. రైతులు జాగ్రత్తగా ఉండాలని కెసిఆర్ పిలుపునిచ్చారు. బుధవా రం జడ్చర్లలో ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొ ని ఆయన మాట్లాడుతూ కర్నాటకలో కాంగ్రెస్ పార్టీ నిన్న గాక మొన్న గెలిచిందని అడ ఏమి డైలాగులు కొట్టిండ్రు 24 కరెంటు ఇస్తామమని చెప్పి 24 గంటలు కాదు ఐదు గంటలే కరెంటు ఇస్తామని సరిపెట్టుకోండి ఎవడి గొంగడి వాడే అని నిన్ననే ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రకటించాడని ఎద్దేవా చేశారు. అంటే ఏమి చేయాలి తెల్లారితే సగం, పొద్దాక సగం, ఇంటికాడ పండాల్నా బాయి కాడా పండాల్నా ఏవేమీ బాధలు అని కెసిఆర్ అన్నారు.
ఈయాల కాంగ్రెస్ అధ్యక్షుడు కడుపులో ఉన్న మాట కక్కాడని కెసిఆర్ అనవసరంగా 24 గంటలు కరెంటు వేస్టుగా ఇస్తున్నాడని అసలు మూడు గంటలు చాలని అంటున్నాడని 3 గంటలు సరిపోతదా? 24 గంటలు కావాల్నా ప్రజలు తెల్చుకోవాలన్నారు. కాంగ్రెస్ పార్టీ వస్తే గ్యారంటిగా కరెంట్‌ను కాట కలుపుతరు. మీరు ఆలోచన చేయాలన్నారు. భారత దేశంలో మొత్తంలో 24 గంటలు ఇస్తున్నది తెలంగాణ రాష్ట్రం ఒక్కటే అని ఆయన స్పష్టం చేశారు. ప్రధాన మంత్రికి కూడా 24 గంటల కరెంటు ఇవ్వటానికి చేతకావటం లేదని కెసిఆర్ పేర్కొన్నారు. ప్రధాని మోడీ సొంత రాష్ట్రంలో 24 గంటలు లేదని అక్కడి రైతులు గొడవ చేస్తున్నారన్నారు. ఏమైతదని కాంగ్రెస్‌కు ఓటేస్తే రైతు బంధుకు రాంరాం. వచ్చేవి ఎన్నికలు కాబట్టి అడ్డం పొడవు ఎవడు పడితే వాడు మాట్లాడుతున్నారని వారి మాటలు నమ్మితే నట్టేట మునగటం ఖాయమన్నారు.
ఆ నాడు మహబూబ్‌నగర్‌ను చూస్తే కన్నీళ్లు వచ్చేవి
మహబూబ్ నగర్ జిల్లా గత ఉద్యమ సందర్భంలో ఏ మూలుకు పోయినా.. ఏ ప్రాంతానికి పోయినా ఎప్పుడు కూడా దుఃఖంతో కళ్లు నిండిపోయేవని ఆనాటి జ్ఞాపకాలను సిఎం కెసిఆర్ గుర్తుచేశారు. ఆ రోజుల్లో ప్రొఫెసర్ జయశంకర్ బతికే ఉండే నాతో పాటు తిరిగేవారని ఆనాడే చెప్పారని మహబూబ్ నగర్ దరిద్రం పోవాలంటే అక్కడ నుంచి మీరు ఖచ్చితంగా ఎంపిగా పోటీ చేయాలని సూచించారని ప్రజలు మిమ్మల్ని ఓడగొట్టరు గెలిపిస్తరు … అప్పుడు మీకు అనుభవం వస్తది అని చెబితే నేను ఇక్కడి నుంచి ఎంపిగా పోటీ చేశానని తెలిపారు. ఆనాడు లకా్ష్మరెడ్డి తన వెంట ఉండి గెలిపించారన్నారు. ఏ రోజుకైనా పాలమూరు చరిత్రతో కీర్తి శాశ్వతంగా ఉంటదన్నారు. నేను 15 ఏండ్లు పోరాటం చేసినప్పటికీ నేను మహబూబనగర్ ఎంపిగా ఉంటూనే తెలంగాణా రాష్ట్రం సాధించిన విషయం కూడా చిరస్థ్దాయిగా నిలిచిపోతుందన్నారు. ఒక నాడు జయశంకర్ నేను నారాయణపేట ప్రాంతం పోయి మహబూబ్ నగర్ గూండా రోడ్డు మార్గాన వెళ్తుంటే నవాబుపేట మధ్యలో చిన్న అడవి ఉందని,
అడవిలో లైట్లులో వేసిన చెట్లని చూసి మనుసులు కాదు చివరకు మహబూబ్ నగర్‌లో అడవి కూడా బక్కచిక్కిపోయాయని ఎంతో బాధపడ్డామని పేర్కొన్నారు. ఒక్క గోస కాదు మహబూబ్ నగర్ అనేక సందర్భల్లో కళ్లనిండా నీళ్లు వచ్చాయన్నారు. మహబూబ్‌నగర్‌లో గంజి కేంద్రాలు, అంబలి కేంద్రాలు పెడ్తుంటే గుండెలు అలిసేలా బాధకలిగేందన్నారు. ఏమి దుర్గతి పట్టిందని, పక్కనే కృష్ణానది పారుతున్నా అవకాశాలు ఉన్నా కూడా ముఖ్యమంత్రులు రావడం, దత్తత తీసుకోవడం, నాటకాలు అడడం, శిలాఫలకాలు వేయడం తప్ప కొంచం కూడా లాభం జరగలేదన్నారు. ఉద్యమంలో నేనే పాట రాసినా, పక్కనే కృష్ణమ్మ ఉన్నా ఫలితమేమి లేకపోయే.. పాలమూరు నల్గగొండ ఖమ్మం మెట్టు పంటలెండి అని రాశానని తెలిపారు. మహబూబ్ నగర్ నా గుండెల్లో ఉందన్నారు. మొట్టమొదటిసారిగా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత లకా్ష్మరెడ్డి తన కేబినెట్‌లో మంత్రిగా ఉన్నారని వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా ఉండే ఈ రోజు వచ్చిన డయాగ్నసిస్ సెంటర్లు కూడా లకా్ష్మరెడ్డి పుణ్యమేనని కెసిఆర్ తెలిపారు.
అనాటి ముఖ్యమంత్రులు, దద్దమ్మ ఎంఎల్‌ఎలు జూరాల నుంచి తీసుకోమన్నారు..!
ఉమ్మడి రాష్ట్రంలోని ముఖ్యమంత్రులు జూరాల ప్రాజెక్టు నుంచి నీళ్లు తీసుకోమన్నారన్నారు. నేను ఒక్కటే చెబుతున్నానని జూరాల పెద్ద ప్రాజెక్టు దానిలో నీళ్లు ఉండేదే 9 నుంచి 10 టిఎంసిలు మనం తీసుకునేది దినానికి రెండు టిఎంసిలు రోజు రెండు టిఎంసిలు గుంజితే అది నాలుగైదు రోజుల్లోనే కతమై పోతదన్నారు. మళ్లీ తర్వాత నీళ్లు ఎక్కడ నుంచి తీసుకోవాలి. అందుకే శ్రీశైలం నుంచే తీసుకోవాలని అన్నాను. శ్రీశైలం వారి అయ్య జాగీరా… అందులో మా పైసలు లేవ్వా .. బాజాప్తా శ్రీశైలం నుంచి తీసుకోవాలని చెప్పి అధికారులకు చెప్పి పాలమూరు ఎత్తిపోతల పథకం సోర్సును జూరాల నుంచి శ్రీశైలంకు మార్చినామని సిఎం కెసిఆర్ తెలిపారు. ఇక్కడున్న కొందరు దద్దమ్మలు జూరాల నుంచే నీళ్లు తీసుకోవాలని అంటున్నారు. వారికి ఎంత తెలివి ఉందో అర్థం కావడం లేదన్నారు. ఈ జిల్లాలో ఎట్లా పుట్టిండ్రో అర్థం కావడం లేదన్నారు. వారు మాట్లాడినప్పుడు చాలా బాధ కలుగుతుందని జూరాల నుంచి తీసుకోవాలని సిగ్గుపడాలన్నారు.
జూరాల నీళ్లు ఎన్ని ఉన్నయో తెల్సా ఎన్ని రోజులకు వస్తాయో తెలుసా… ఆ రోజు భావ దరిద్రమే.. మధ్యలో ఉద్యమం చేస్తుంటే భావ దారిద్రమే ఈయాల కూడా భావ దారిద్రమే అని ఆవేదన వ్యక్తం చేశారు. 1956లో చిన్న పొరపాటు జరిగిందన్నారు. కొద్దిగా మనొళ్లు మరిచి పోయి ఉన్నరు. ఆ దెబ్బకు మనల్ని తీసుకుపోయి ఆంధ్రాలో కలిపేస్తే గంజికేంద్రాలు తీసుకొచ్చే పరిస్థితికి వచ్చామన్నారు. పాలమూరు జిల్లా ముంబాయికి వలసలు జరిగి ఆగం అయ్యామని జడ్చర్లలో కూడా లంబాడి ఆడబిడ్డలు హైదరాబాద్‌కో, ఇంకొక చోటుకు వెళ్లి బతికే పరిస్థితి అప్పుడు వచ్చిందని గుర్తు చేశారు. ఆ నాడు కళ్లారా చూశాం. బాధలు పడ్డాం. గోరేటి వెంకన్న ఈ జిల్లా వాసేనని ఆనాడు ఆయన రాసిన పల్లెపల్లెన పల్లేర్లు మొలిసే పాలమూరులోన అని … మన జీవితం ఇదేనా, దీని కోసం పుట్టినమా అని పిడికెళెత్తి పొరాటం చేస్తే మీరంత దీవెన చేస్తే తెలంగాణ వచ్చిందని తెలిపారు.
చావు నోట్లో పెట్టి తెలంగాణాను తీసుకొచ్చా
తెలంగాణ ఊరికే రాలేదని విద్యార్దులను చావగొట్టి… చాలా బాధలు పెట్టి చివరికి ఆమరణ దీక్ష చేసి చావు నోట్లు తలకాయి పెట్టితే తప్ప తెలంగాణ రాలేదన్నారు. పుణ్యానికి తెలంగాణ రాలే.. ఎవడు ఇవ్వలేదన్నారు. కాంగ్రెస్ పార్టీ 60 ఏండ్ల మన గోష పోసుకొని ముంబాయి పొయేటట్లు చేసింది. ఇది ఎప్పటికీ మరిచిపోవద్దని కెసిఆర్ సూచించారు. మహబూబ్‌నగర్‌లో పాలమూరు ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించామని, దానిని ఆపటానికి ఇదే జిల్లాలో పుట్టిన కొందరు దరిద్రులు కాంగ్రెస్ నాయకులు వెళ్లి కేసులు వేశారని పాలమూరు రంగారెడ్డి వస్తే లకా్ష్మరెడ్డికి మంచి పేరు వస్తుందన్నారు. శ్రీనివాస్ గౌడ్‌కు పేరొస్తది లేక కెసిఆర్‌కు పేరొస్తదని అడ్డుపడ్డారన్నారని విమర్శించారు. ఈ మధ్యన 9 సంవత్సరాల పోరాటం తర్వాత బ్రహ్మాండంగా ఒక్కొక్కటి అనుమతులు వస్తున్నాయని ఎప్పటికైనా దర్మమే గెలుస్తుందన్నారు. అందుకే మొన్ననే పాలమూరు ఎత్తిపోతల పథకాన్ని నేను ప్రారంభం చేశానని దాని మీద రావాల్సిన నార్లపూర్, వట్టెం, కర్వేన, ఉదండాపూర్ కావచ్చు అన్ని రిజర్వాయర్లు అన్ని కంప్లీట్ చేసుకున్నామన్నారు. టన్నెల్లు కూడా పూర్తి చేసుకున్నాని మోటార్లు బిగించే పనులు జరుగుతున్నాయని రాబోయే రెండు మూడు నెలలో బ్రహ్మాండంగా నీళ్లను చూస్తామని కెసిఆర్ తెలిపారు.
పాలమూరు పాలుగారే జిల్లాగా మారుతుంది
పాలమూరు కరువన్నది పోతదని, ఉదండపూర్ ప్రాజెక్టు పూర్తి అయితే జడ్చర్ల నియోజకవర్గంలో 1.50 వేల ఎకరాలకు నీరు వస్తుందని కెసిఆర్ పేర్కొన్నారు. కరువన్నది మనవైపు కన్నెత్తి చూసే ప్రసక్తే లేదన్నారు. పాలమూరు సస్యశ్యామలం అవుతుందని మీకు హామీ ఇస్తున్నా. ఇప్పటికే లకా్ష్మరెడ్డి పోలేపల్లి సెజ్ తెచ్చి చాలా మందికి ఉద్యోగాలు కల్పించారన్నారు. రాబోయే రోజుల్లో బ్రహ్మాండగా పరిశ్రమల కేంద్రంగా ఐటి హబ్‌గా జడ్చర్లను తీర్చిదిద్దుదామని హామీ ఇస్తున్నారని తెలిపారు. మిషన్ భగీరథతో ప్రతి ఇంటికి నల్లా నీళ్లు ఇస్తున్నామన్నారు. పెండింగ్‌లో ఉన్న కల్వకుర్తి, నెట్టెం పాడు, భీమా కోయిల్‌సాగర్ వీటన్నింటిని కంప్లీట్ చేసుకున్నామని సిఎం పేర్కొన్నారు. పాలమూరు ఎత్తిపోతల పథకం కూడా 90 శాతం పూర్తి అయ్యిందని ఇంకా పది శాతం పూర్తి కావాల్సి ఉందని కెసిఆర్ తెలిపారు. పాలమూరు రంగారెడ్డి పూర్తయితే పాలమూరు పాలుగారే జిల్లాగా మారుతుందన్నారు.
ఒకప్పుడు దుమ్ముకొట్టుకు పొయిన దుందుభి ఈయాల జీవనదిగా మారిందని పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో పాలమూరు ఎత్తిపోతల పథకం పూర్తి అయితే ఈ జిల్లా స్వరూపమే మారిపోతుందన్నారు. బిసి, ఎస్‌సి, ఎస్‌టి, మైనార్టీల కోసం గురుకుల రెసిడెన్సియల్ పాఠశాలలు పెట్టుకున్నాం.. ఇప్పుడు అగ్రవర్ణ పేదల పిల్లలలకు కూడా నియోజకవర్గానికి ఒకటి చొప్పున 119 రెసిడెన్సియల్ ఏర్పాటు చేయబోతున్నామని తెలిపారు.
నేను పుట్టించిందే రైతు బంధు ప్రపంచంలో ఎక్కడా లేదు
ఇటీవలనే మనం మేని ఫెస్టో విడుదల చేసుకున్నామని ఓట్ల కోసం లంగమాటలు చెప్పలేదన్నారు. అబద్ధ్దాలు చెప్పే అలవాటు లేదని సంసారం చేసినట్లు రైతుల కోసం పట్టుబట్టి జట్టుకట్టి చెట్టుకొకరు పుట్టకొకరు పోతే తట్టుకోలేక వారి బతుకులు మారాలని ఎవరు చెప్పినా వినకుండా నేను పుట్టించిందే రైతు బందు పథకం అని కెసిఆర్ తెలిపారు. ప్రపంచంలో ఎక్కడా ఇటువంటి పథకం లేదని ఈయాల వాడొకడు, వీడొకలు వచ్చి అడ్డం పొడవు మాటలు మాట్లాడుతున్నారని బిఆర్‌ఎస్ ప్రభుత్వం లేకున్నప్పుడు రైతు బంధు గురించి విన్నామా అని ప్రశ్నించారు. వెనకటి రోజుల్లో పటాకులు కాలినట్లు ట్రాన్సఫార్మర్లు కాలిపోయేవన్నారు. వాటి మరమ్మతులకు లంచాలు అడిగితే ఎంత గోసపడ్డామని మరచిపోవద్దని కోరారు. నేను కాపోన్నే..రైతునే. రైతులు బాధలు తెలుసు..జిద్దుబట్టి రైతు బంధు తెస్తే రైతులు ముఖాలు తెల్లగా అవుతున్నాయన్నారు. రూ. 37 వేల కోట్లు మాఫీ చేసుకున్నామని ఇప్పుడిప్పుడే కష్టాల నుంచి నట్టేక్కుతున్నామని మళ్లీ మాయమాటలు నమ్మి వెనక్కుపోవద్దని కోరారు. మరో పదేళ్లు కష్టపడితే భారత దేశంలో మన రైతు గొప్ప రైతుగా మారే పరిస్దితి వస్తుందని కెసిఆర్ తెలిపారు. ఈ సభలో ఎమ్మెల్యే అభ్యర్ది లకా్ష్మరెడ్డి, మంత్రి శ్రీనివాస్ గౌడ్, ఎంపి మన్నె శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.