- Advertisement -
కామారెడ్డి గడ్డతో తనకు పుట్టినప్పటి నుంచి సంబంధం ఉందని ముఖ్యమంత్రి కెసిఆర్ అన్నారు. కామారెడ్డిలో భారత రాష్ట్ర సమితి ప్రజా ఆశీర్వాద సభ నిర్వహించింది. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి కెసిఆర్ ఎాల్గొన్నారు. కోనాపూర్ గా పిలుస్తున్న పోసానిపల్లిలో మా అమ్మ పుట్టారని కెసిఆర్ తెలిపారు. తెలంగాణ ఉద్యమ సమయంలో ఇక్కడి లాయర్లు చైతన్యం చూపారన్నారు. కామారెడ్డి జిల్లా చేసుకున్నాం.. మెడికల్ కాలేజీ తెచ్చుకున్నామన్నారు.
జలసాధన ఉద్యమం 45 రోజులు చేశామని తెలిపారు. జలసాధన ఉద్యమంలో బ్రిగేడియర్లను నియమించాం… కామారెడ్డి బ్రిగేడియర్ గా నేనే ఉన్నానని కెటిఆర్ వెల్లడించారు. కాళేశ్వరం పనులు ఆగమేఘాలపై జరుగుతున్నాయన్న కెసిఆర్ కామారెడ్డి, ఎల్లారెడ్డి నియోజకవర్గాలకు నీళ్లు తెస్తామని హామీ ఇచ్చారు. దాదాపు రెండేళ్లలో రెండు ప్రాంతాల్లో నీళ్లు పారుతాయని స్పష్టం చేశారు.
- Advertisement -