- Advertisement -
ప్రొ. జయశంకర్‌కు సిఎం కెసిఆర్ నివాళులు
మన తెలంగాణ/ హైదరాబాద్ : తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర స్వాప్నికుడు, స్వర్గీయ ప్రొఫెసర్ జయశంకర్ జయంతి(6 ఆగస్ట్) సందర్భంగా ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు ఆయనకు నివాళులర్పించారు. ఉమ్మడి పాలనలో నాడు తెలంగాణకు జరిగిన నష్టాలను కష్టాలను వివరిస్తూ, తెలంగాణ స్వరాష్ట్ర ఆకాంక్షలను, ప్రజల్లో ఉద్య మ భావజాలాన్ని ప్రొ. జయశంకర్ రగిలించారని సిఎం కెసిఆర్ స్మరించుకున్నారు. జయశంకర్ స్ఫూర్తితో ఉద్యమాన్ని కొనసాగించి, మొక్కవోని దీక్షతో సాహసోపేత పోరాటం చేసి స్వరాష్ట్రాన్ని సాధించుకున్నామని తెలిపారు. జయశంకర్ సార్ ఆశించినట్లుగానే స్వయం పాలనలో తెలంగాణ రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలిచిందని అన్నారు. సబ్బండ వర్గాల సంక్షేమానికి పాటుపడుతూ, సకల జనుల అభ్యున్నతిని సాధిస్తూ, రాష్ట్ర ప్రభుత్వం ప్రొ.జయశంకర్ కలను సాకారం చేస్తున్నదన్నారు.
- Advertisement -