Monday, December 23, 2024

సాయిచంద్ దశ దినకర్మకు హాజరైన సిఎం కెసిఆర్..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: తెలంగాణ ఉద్యమ ప్రజా గాయకుడు, రాష్ట్ర గిడ్డంగుల కార్పొరేషన్ ఛైర్మన్ వేద సాయిచంద్ దశ దినకర్మ కార్యక్రమానికి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు హాజరై ఘన నివాళులర్పించారు. నగరంలోని హస్థినాపురంలో సాయిచంద్ దశ దినకర్మ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన సిఎం కెసిఆర్ సాయి చంద్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు.

ఈ సందర్భంగా సాయి చంద్ కుటుంబ సభ్యులను ఓదార్చి, ధైర్యం చెప్పారు. కుటుంబ సభ్యులకు అండగా ఉంటామని సిఎం కెసిఆర్ భరోసా ఇచ్చారు. కాగా, సాయి చంద్ గుండెపోటుతో మరణించిన విషయం తెలిసందే.

Also Read: ఎన్నికల కార్యాచరణపై 11 రాష్ట్రాల అధ్యక్షులతో జెపి నడ్డా సమావేశం

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News