మహబూబ్‌నగర్: ఎక్సైజ్, క్రీడలు, పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ తల్లి శాంతమ్మకు రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు నివాళులు అర్పించారు. ఇటీవల మంత్రి శ్రీనివాస్ గౌడ్ తల్లి శాంతమ్మ(78) గుండెపోటుతో కన్నుమూసిన విషయం తెలిసిందే. దీంతో రాష్ట్ర ఐటి, పురపాలక శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు, హరీశ్ రావులతోపాటు పలువురు మంత్రులు మంత్రి శ్రీనివాస్ గౌడ్‌ను కలిసి పరామర్శించారు. ఈ నేపథ్యంలో ఆదివారం శాంతమ్మ దశదిన కర్మకు సిఎం కెసిఆర్ హాజరై.. ఆమె సమాధి వద్ద పూలమాల వేసి నివాళులు అర్పించిచారు. అనంతరం సిఎం కెసిఆర్ మహబూబ్ నగర్ నుండి హైదరాబాద్ కు తిరిగి వెళ్లిపోయారు. సిఎం కెసిఆర్ తోపాటు ఈ కార్యక్రమానికి రాష్ట్ర మంత్రులు మహమూద్ అలీ, గంగుల కమలాకర్, తలసాని శ్రీనివాస్ యాదవ్, నిరంజన్ రెడ్డి, ఎంపీ లు మన్నే శ్రీనివాస్ రెడ్డి, పోతుగంటి రాములు, జిల్లా పరిషత్ చైర్మన్లు, జిల్లా కలెక్టర్ ఎస్.వెంకట రావు, ఎస్.పి ఆర్.వెంకటేశ్వర్లు, పలువురు ప్రజా ప్రతినిధులు, అధికారులు హాజరయ్యారు.
CM KCR Pays tribute to Srinivas Goud Mother