Sunday, December 22, 2024

వేముల మంజులమ్మ మృతికి సిఎం కెసిఆర్ నివాళి

- Advertisement -
- Advertisement -

నిజామాబాద్: రాష్ట్ర రోడ్లు భవనాలు శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి తల్లి అంత్యక్రియల్లో తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌ రావు పాల్గొన్నారు. ప్రశాంత్ రెడ్డి తల్లి మంజులమ్మ పార్థివదేహానికి సిఎం కెసిఆర్ శ్రద్ధాంజలి ఘటించారు. శోకతప్తులైన కుటుంబసభ్యులను సిఎం ఓదార్చి మనోధైర్యం చెప్పారు. వేల్పూర్‌లో మంజులమ్మ అంత్యక్రియలు శుక్రవారం నిర్వహించారు. ప్రగతి భవన్ నుంచి సిఎం ఉదయం వేల్పూర్ బయలు దేరారు.

మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి తల్లి వేముల మంజులమ్మ (77) గురువారం కన్నుమూశారు. ఏడాది కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. మంజులమ్మ గతంలో బ్రెయిన్ ట్యూమర్ సర్జరీ చేయించుకుని కోలుకున్నారు. అయితే ఆమె ఆరోగ్యం మరింత విషమించి కన్నుమూసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News