Friday, January 24, 2025

ప్రగతిభవన్‌లో సిఎం కెసిఆర్ ప్రత్యేక పూజలు

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్: దసరా సందర్భంగా ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ప్రగతిభవన్‌లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. మొదటగా నల్ల పోచమ్మ ఆలయంలో సిఎం కెసిఆర్ దంపతులు, కుటుంబ సభ్యులు పూజలు నిర్వహించారు. అనంతరం జమ్మి వృక్షానికి వేద పండితుల సమక్షంలో సాంప్రదాయబద్దంగా పూజలు నిర్వహించారు. పవిత్ర జమ్మి ఆకును అక్కడ హాజరైన వారందరికీ పంచిన సిఎం పరస్పర శుభాకాంక్షలు అందించి, ఆశీర్వదించారు. అనంతరం ప్రగతి భవన్‌లో సిఎం కెసిఆర్ ఆయుధ పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులు, ప్రజా ప్రతినిధులు, సిఎంఒ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

CM KCR Perform Special Pooja in Pragathi Bhavan

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News