హైదరాబాద్: ముఖ్యమంత్రి కేసీఆర్ భద్రాచలం చేరుకున్నారు. ఉప్పొంగి ప్రవహిస్తున్న గోదావరి నదికి సిఎం కెసిఆర్ శాంతి పూజ నిర్వహించారు. వంతెన పైనుంచి గోదావరి పరిసరాలను సీఎం పరిశీలించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు పువ్వాడ అజయ్ కుమార్, హరీశ్‌రావు, ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్‌తో పాటు పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. మరికాసేపట్లో గోదావరి వరద తాకిడికి గురైన కరకట్టను పరిశీలిస్తారు. అక్కడ నుంచి వరద ముంపు బాధితుల కోసం ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రానికి సిఎం చేరుకుంటారు. వరద బాధితులను పరామర్శిస్తారు. పునరావాస కేంద్రంలో వరద బాధితులకు అందుతున్న వైద్యం, తదితర సహాయ కార్యక్రమాలను తెలుసుకుని వారికి భరోసానిస్తారు. ఆ తర్వాత వరద పరిస్థితికి సంబంధించి ఇప్పటికే స్థానికంగా చేపట్టిన సహాయ కార్యక్రమాలపై, చేపట్టాల్సిన మరిన్ని కార్యక్రమాలపై మంత్రులు పువ్వాడ అజయ్, హరీశ్ రావు, ప్రజాప్రతినిధులు, అధికారులతో సీఎం కేసీఆర్ సమీక్షా సమావేశం నిర్వహిస్తారు.
గోదావరి నదికి శాంతి పూజ చేసిన సిఎం కెసిఆర్
- Advertisement -
- Advertisement -
- Advertisement -