యాదాద్రి భువనగిరి: యాదాద్రి ఆలయ మహాకుంభ సంప్రోక్షణ తొలి పూజలో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు దంపతులు పాల్గొన్నారు. ఆలయ ప్రధాన అర్చకులు వారికి ఆశీర్వచనం అందించారు. మహాకుంభ సంప్రోక్షణ ఉత్సవంలో భాగంగా, దివ్య విమాన గోపురంపైన శ్రీ సుదర్శన చక్రానికి సీఎం కేసీఆర్ దంపతులు ప్రత్యేక పూజలు చేసి పవిత్ర జలాలతో అభిషేకం నిర్వహించారు. అంతకుముందు బాలాలయంలోని స్వామివారు, అమ్మవార్ల ప్రతిష్ఠామూర్తులతో నిర్వహించిన శోభాయాత్రలో సిఎం దంపతుల తోపాటు మంత్రులు, ఎంపిలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ప్రభుత్వ అధికారులు, అర్చకులు, వేద పండితులు పాల్గొన్నారు.
అత్యంత వైభవంగా… దేదీప్యమానంగా… #Yadadri – మహా కుంభ సంప్రోక్షణ మహోత్సవం
– నమో నారసింహా.. యాదాద్రీశా గోవిందా.. శ్రీలక్ష్మీ నరసింహస్వామి నామస్మరణ, భక్తుల జయ జయధ్వానాల మధ్య సోమవారం ఉదయం నవ వైకుంఠంగా పునర్నిర్మించిన యాదాద్రిలో మహా కుంభ సంప్రోక్షణ మహోత్సవం వైభవంగా జరిగింది pic.twitter.com/6vcQZs1Ydu
— TRS Party (@trspartyonline) March 28, 2022
CM KCR Performs Pooja to Lakshmi Narasimha Swamy