Friday, December 27, 2024

మంత్రి పువ్వాడ అజయ్‌కు సిఎం కెసిఆర్ ఫోన్

- Advertisement -
- Advertisement -

ఖమ్మంలో బుధవారం జరిగిన బీఆర్ఎస్ పార్టీ భారీ బహిరంగ సభ విజయవంతం అవ్వడం, సభకు లక్షలాది మంది ప్రజలు, పార్టీ శ్రేణులు హాజరుకావడం పట్ల ముఖ్యమంత్రి కేసిఆర్ హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ కి సీఎం కేసిఆర్ ప్రత్యేకంగా ఫోన్ చేసి అభినందనలు తెలిపారు. తను హెలికాప్టర్ ద్వారా వీక్షించిన సమయంలోనూ కనుచూపు మేర జన సముద్రం కనిపించిందని సీఎం కేసిఆర్ కితాబు ఇచ్చారు.

నిరంతరం పార్టీ నాయకులను, శ్రేణులను సమన్వయం చేస్తూ ముందుకు నడిపించి, ప్రజలతో మమేకమైన మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ను ఈ సందర్భంగా సీఎం అభినందించారు. ఖమ్మం జిల్లా చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా కనీవినీ ఎరుగని రీతిలో సభ నిర్వహించారని అన్నారు. దేశంలో ప్రతిపక్ష ఐక్య పోరాటానికి బీఆర్ఎస్ పార్టీ కేంద్ర బిందువుగా నిలిచిందని, దానికి ఖమ్మం లో జరిగిన సభనే ఒక సూచికని జాతీయ రాజకీయాల్లో బీఆర్‌ఎస్‌ ప్రకంపనలు సృష్టించనుండగా, ఖమ్మం సభ ఆ భూకంప కేంద్రంగా మారిందని సీఎం కేసిఆర్ పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News