Thursday, January 23, 2025

ప్రమాదపుటంచున కడెం ప్రాజెక్టు… ఇంద్రకరణ్ రెడ్డికి కెసిఆర్ ఫోన్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: కడెం ప్రాజెక్టుకు ప్రమాదం స్థాయిలో వరద ఉధృతి రావడంతో మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డికి సిఎం కెసిఆర్ ఫోన్ చేశారు. కడెం ప్రాజెక్టు లో వరద పరిస్థితిపై ఆరా తీశారు. పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని మంత్రిని కెసిఆర్ ఆదేశించారు. ఇన్ ఫ్లో, ఔట్ ఫ్లో వివరాలు అడిగి తెలుసుకోవడంతో పాటు మంపు గ్రామాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించడంతో పాటు సహాయక చర్యలు చేపట్టాలని మంత్రికి సూచించారు. ప్రాజెక్టు వద్ద ఉన్న పరిస్థితులను సిఎం కెసిఆర్ కు ఎప్పటికప్పుడు సమాచారం ఇస్తున్నామని ఇంద్రకరణ్ తెలిపారు.

వరద కొంత వరకు తగ్గుముఖం పట్టిందని తెలిపారు.  ప్రాజెక్టుకు ప్రమాదకర స్థితిలో వరద నీరుచేరుకుంటుందని వివరించారు.
జిల్లా యంత్రాంగం అప్రమత్తమై కడెం పరిసర గ్రామాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పేర్కొన్నారు. ఎగువ ప్రాంతంలో ఉన్న ఎస్సారెస్పితో పాటు బోథ్ ప్రాంతం నుంచి పెద్ద ఎత్తున వరద నీరు ప్రాజెక్టులోకి చేరుకోవడంతో ఈ పరిస్థితి నెలకొందన్నారు.  ఎమ్మెల్యే రేఖా నాయక్, కలెక్టర్ ముష్రఫ్ అలీ ఫారూఖీ, జిల్లా ఎస్పీ ప్రవీణ్ కుమార్, రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులతో ఎప్పటికప్పుడు వరద పరిస్థితిని సమీక్షిస్తున్నారు. అలాగే సిఎస్, ఇరిగేషన్ శాఖ ఉన్నతాధికారులకు ఎప్పటికప్పుడు అధికారులు ఇక్కడ ఉన్నతాజా పరిస్థితిని వివరిస్తున్నారు.  ప్రస్తుతం వర్షాలు తగ్గితేనే వరద నీటి ప్రవాహం తగ్గే అవకాశాలున్నాయి. ఇప్పటికైతే కొద్దిగా వరద నీటి ప్రవాహం తగ్గింది. ఇన్ ఫ్లో ఎక్కువగా ఉండి ఔట్ ఫ్లో తక్కువగా ఉండడంతో ఇరిగేషన్ అధికారులు రెడ్ అలర్ట్ ప్రకటించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News