- Advertisement -
హైదరాబాద్: మెగాస్టార్ చిరంజీవిని తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఫోన్ ద్వారా పరామర్శించారు. బుధవారం తనకు కరోనా పాజిటీవ్ వచ్చినట్లు చిరంజీవి ట్వీటర్ ద్వారా వెల్లడించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సిఎం కెసిఆర్, చిరుకు ఫోన్ చేసి మాట్లాడారు. గురువారం ఉదయం చిరుకు ఫోన్ చేసిన కెసిఆర్ పరామర్శించారు. కోవిడ్ నుంచి త్వరగా కోలుకోవాలని సిఎం కెసిఆర్ ఆకాంక్షించారు. పలువురు ప్రముఖులు కూడా చిరు త్వరగా కరోనా నుంచి కోలుకోవాలని ట్వీట్ చేస్తున్నారు. కాగా, చిరంజీవి కరోనా బారిన పడడం ఇది రెండోసారి.
CM KCR Phone to Megastar Chiranjeevi
- Advertisement -