Monday, January 20, 2025

కాంగ్రెస్ పార్టీపై సంచలన వ్యాఖ్యలు చేసిన మంత్రి హరీశ్ రావు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: రాబోయే రాష్ట్ర ఎన్నికల్లో ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు ధీమాతో బిఆర్‌ఎస్ పార్టీ 100 సీట్లు గెలిచి ఘన విజయం సాధిస్తుందని రాష్ట్ర ఆర్థిక, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు ధీమా వ్యక్తం చేశారు. కెసిఆర్ హ్యాట్రిక్‌ కొట్టడం పక్క అన్నారు. ఎన్నికలు సమీపించినప్పుడల్లా కాంగ్రెస్‌ మోసపూరిత సర్వేలు, గూగుల్‌ ప్రచార వ్యూహాలకు పాల్పడుతోందని హరీశ్‌రావు మండిపడ్డారు.

అక్టోబర్ 15న హుస్నాబాద్‌లో జరగనున్న ముఖ్యమంత్రి కెసిఆర్ బహిరంగ సభ ఏర్పాట్లను పరిశీలించిన సందర్భంగా హరీశ్ రావు ఈ వ్యాఖ్యలు చేశారు. కార్యక్రమంలో ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్‌కుమార్‌, స్థానిక ఎమ్మెల్యే సతీష్‌బాబు, ఇతర అధికారులు పాల్గొన్నారు. హుస్నాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం ప్రజలతో కేసీఆర్‌కు ఉన్న బలమైన అనుబంధాన్ని ఆరోగ్య శాఖ మంత్రి హైలైట్ చేశారు.

ముఖ్యమంత్రి బహిరంగ సభను విజయవంతం చేయాలని హరీశ్‌రావు ప్రజలకు పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పార్టీపై విరుచుకుపడిన హరీశ్ రావు, వారు ఖాళీ వాగ్దానాలు, కర్ఫ్యూలు, అల్లర్లు, గందరగోళాలకు ప్రసిద్ధి చెందారని, వారి అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ ఇంకా కొనసాగుతోందని పేర్కొన్నారు. 50 రోజుల క్రితం తమ అభ్యర్థులను ప్రకటించిన బీఆర్‌ఎస్ పార్టీలా కాకుండా, ముఖ్యమంత్రి అభ్యర్థిని పక్కన పెడితే కాంగ్రెస్ ఇంకా తన పోటీదారుల జాబితాను ఖరారు చేయలేదని ఎద్దేవా చేశారు.

2014, 2018 నుంచి పార్టీ మేనిఫెస్టోల్లో పెట్టిన హామీలను నెరవేర్చడంలో కేసీఆర్‌ ట్రాక్‌ రికార్డును హరీశ్‌రావు ఎత్తిచూపారు. అధికారం కోసం కాంగ్రెస్ తప్పుడు వాగ్దానాలు చేస్తోందని, ఈ పొంతన లేని హామీలను ప్రజలు నమ్మవద్దని కోరారు. తప్పుదోవ పట్టించే సర్వేలను ప్రచారం చేసేందుకు కాంగ్రెస్ చేస్తున్న ప్రయత్నాలను హరీశ్ రావు తోసిపుచ్చారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News