Thursday, January 23, 2025

ప్రమోషన్లు,బదిలీలపై సిఎం సానుకూలం : మంత్రి హరీష్‌రావు

- Advertisement -
- Advertisement -

 

హైదరాబాద్రా : రాష్ట్రంలో ప్రభుత్వ ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరిస్తామని మంత్రి హరీష్ రావు తెలిపారు. హైదరాబాద్ వనస్థలిపురంలో నిర్వహించిన ఎస్టీయు సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడుతూ కేంద్రం వివక్షత కారణంగానే ఉపాధ్యాయులకు జీతాల చెల్లింపులో ఆలస్యం జరుగుతుందని మంత్రి వివరించారు. విద్యాశాఖలోని ఖాళీలన్నింటిని భర్తీ చేస్తామని హరీష్ రావు పేర్కోన్నారు. ప్రమోషన్లు, బదిలీల విషయంలో సిఎం కెసిఆర్ సానుకూలంగా ఉన్నారని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఉద్యోగుల విషయంలో మాది ఫ్రెండ్లీ ప్రభుత్వమని అన్నారు.

మొదటి సారి 43 శాతం ఫిట్‌మెంట్ ఇచ్చామని, 11వ వేతన సవరణ ద్వారా 30 శాతం ఫిట్‌మెంట్ ప్రకటించామని మంత్రి తెలిపారు. మన పక్కన ఉన్న ఎపి ప్రభుత్వం కంటే ఇది ఎక్కువ వేతనం అని అన్నారు. ఒకటో తారిఖు జీతం రాకపోవడానికి కరోనా ఎఫెక్ట్, కేంద్ర సహాయ నిరాకరణ వల్ల కొంత ఆర్థిక ఇబ్బందులే కారణమని, కావాలనే కేంద్ర ప్రభుత్వం ఇబ్బంది పెడుతుందని హరీష్ రావు స్పష్టం చేశారు. కేంద్రం ఏకపక్షంగా 40 వేల కోట్లకు కోత పెట్టిందని మంత్రి హరీష్ రావు మండిపడ్డారు. ఉపాధ్యాయుల సమస్యలను వీలైనంత త్వరగా పరిష్కరించడానికి కృషి చేస్తామని మంత్రి వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News