హైదరాబాద్: హరిత విప్లవ పితామహుడు ఎంఎస్ స్వామినాథన్ మృతి పట్ల సిఎం కెసిఆర్ సంతాపం తెలిపారు. స్వామినాథన్ మృతితో దేశ వ్యవసాయరంగం పెద్ద దిక్కును కోల్పోయిందని, దేశీయ వ్యవసాయాన్ని స్వామినాథన్ వినూత్న పద్దతిలో గుణాత్మక దశకు చేర్చారని ప్రశంసించారు. ఆహార అభివృద్ధిలో భారత్ స్వయం సమృద్ధి సాధించిందంటే స్వామినాథన్ కృషే కారణమన్నారు. వ్యవసాయరంగంలో స్వామినాథన్ చేసిన పరిశోధనలు, సిఫారసులు విప్లవాత్మక మార్పులకు నాంది పలికిందని, ఆహారభద్రతకు జీవితకాలం కృషి చేసిన మొట్టమొదటి వ్యవసాయశాస్త్రవేత్త స్వామినాథన్ అని కొనియాడారు. వ్యవసాయం రంగంలో తెలంగాణ అభివృద్ధిని స్వామినాథన్ పలు సార్లు కొనియాడిన విషయాన్ని కెసిఆర్ గుర్తు చేశారు. వ్యవసాయరంగం సుస్థిరాభివృద్ధి కోసం స్వామినాథన్ చేసిన సిఫారసులు ఒక రైతు బిడ్డగా తనని ఎంతగానే ప్రభావితం చేశాయని చెప్పారు. హరిత విప్లవ పితామహుడు, ప్రముఖ వ్యవసాయ శాస్త్రవేత్త ఎంఎస్ స్వామినాథన్(98) కన్నుమూసిన విషయం తెలిసిందే.
Also Read: ఎంఎస్ స్వామినాథన్ ఇకలేరు….