Friday, January 24, 2025

బిజెపి కుట్రలను రోహిత్ రెడ్డి బయటపెట్టారు: కెసిఆర్

- Advertisement -
- Advertisement -

వికారాబాద్: దేశంలో ప్రజాస్వామ్యంలో రావాల్సినంత పరిణతి రాలేదని సిఎం కెసిఆర్ మండిపడ్డారు. తాండూరులో జరిగిన ప్రజా ఆశీర్వాద సభలో సిఎం కెసిఆర్ ప్రసంగించారు. ఎన్నికలు వస్తే ఆగం కావొద్దని, ఓటు మన తలరాతను మారుస్తుందని, అభ్యర్థుల గుణగణాలు, పార్టీల చరిత్ర చూడాలని కోరారు. మీ ఐదేళ్ల తలరాతను రాసేది ఓటు అని, ఉన్న తెలంగాణను ఊడగొట్టింది కాంగ్రెస్ అని మండిపడ్డారు. కాంగ్రెస్ రాజ్యంలో వాగునీళ్లు వడగట్టుకొని తాగేటోళ్లమని, కాంగ్రెస్ హయాంలో కరెంట్ లేక రైతులు గోస పడ్డారని కెసిఆర్ విమర్శించారు. కాంగ్రెస హయాంలో రూ.200 పెన్షన్‌ను, ఇప్పుడు రూ.2000 చేశామని, మన రాష్ట్రంలో సాగునీటిపై పన్ను రద్దు చేశామని, 24 గంటలు రైతులకు నాణ్యమైన ఉచిత కరెంట్ ఇస్తున్నామని చెప్పారు. ఎకరానికి ఏడాది రైతుబంధు రూ.16 వేలు ఇస్తామని హామీ ఇచ్చారు. మూడు గంటల కరెంట్ చాలు అని రేవంత్ రెడ్డి చెబుతున్నారని, రోహిత్ రెడ్డిని గెలిపిస్తేనే 24 గంటల ఉచిత కరెంట్ వస్తుందన్నారు. కాంగ్రెస్ భూమాతనా భూమేతనా? అని కెసిఆర్ విమర్శించారు. ధరణి తీసేస్తే రైతుబంధు ఎట్లా వస్తుందని అడిగారు. ధరణి తీసేస్తే దళారీల రాజ్యం వస్తుందని చెప్పారు. రోహిత్ రెడ్డి నిజాయితీగా నిలబడ్డ వ్యక్తి అని, మన ప్రభుత్వాన్ని కూల్చేందుకు బిజెపి కుట్ర చేస్తుందని దుయ్యబట్టారు. బిజెపి కుట్రలను రోహిత్ రెడ్డి బయటపెట్టారని ప్రశంసించారు. రోహిత్‌కు మద్దతు ప్రకటించిన సేవాలాల్ సేనకు ధన్యవాదాలు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News