మంత్రి సబితలాంటి ఎమ్మెల్యేను ఇప్పటివరకూ తాను చూడలేదని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. మహేశ్వరంలో జరిగిన బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో మాట్లాడుతూ, సబితా ఇంద్రారెడ్డిపై కేసీఆర్ ప్రశంసల జల్లు కురిపించారు. సబితకు మంత్రి అనే గర్వం లేదనీ, ఒక కార్యకర్తలా పనిచేస్తారని అన్నారు. భూదేవికి ఉన్నంత ఓపిక సబితకు ఉందన్నారు. ఉదయం వర్షం పడినా, సభకు ఇంతమంది వచ్చారంటే సబిత గెలుపు ఖాయమైపోయినట్లేనని ఆయన ధీమా వ్యక్తం చేశారు. సబితకు వేరే వ్యాపకం లేదనీ, నిరంతరం ప్రజా సమస్యల పరిష్కారంలోనే కాలం గడుపుతారని ప్రశంసించారు. నగరంలో నాలాల సమస్య, మంచినీటి సమస్య తీర్చడంలో సబితా ఇంద్రారెడ్డి కృషిని మరచిపోలేమని తెలిపారు. కందుకూరుకు మెడికల్ కాలేజీ వచ్చిందంటే అందుకు సబితే కారణమని ముఖ్యమంత్రి చెబుతూ కాలేజీకి అనుబంధంగా 500 పడకల ఆస్పత్రి రాబోతోందన్నారు. కందుకూరు ఒక హబ్ గా మారబోతోందని, మెట్రో రైలు కూడా వస్తుందని చెప్పారు.
సబితా ఇంద్రారెడ్డిపై కేసీఆర్ ప్రశంసల జల్లు
- Advertisement -
- Advertisement -
- Advertisement -