Saturday, December 21, 2024

కాంగ్రెస్ వస్తే దళారీల రాజ్యం ఐతది: సిఎం కెసిఆర్

- Advertisement -
- Advertisement -

బోథ్: చెరువుల్లో పూడిక తీసి, భూగర్భజలాలు పెంచేందుకు కృషి చేశామని ముఖ్యమంత్రి కెసిఆర్ బోథ్ లో నిర్వహించిన ప్రజా ఆశీర్వదసభలో పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ 58 ఏళ్లు ప్రజలను ఇబ్బందులకు గురిచేసిందని ఆరోపించారు. కాంగ్రెస్ హయాంలో కరెంట్, నీటి కష్టాలు ఉండేవని కెసిఆర్ పేర్కొన్నారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత వెంటనే సాగునీటిపై పన్ను రద్దు చేశామని గుర్తుచేశారు.

రైతుల సంక్షేమం కోసం రైతుబంధు, రైతుబీమా అమలు చేశామని చెప్పారు. రైతుబంధు దుబారా అని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. 3 గంటలు చాలు అని పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అంటున్నారని తెలిపారు. రైతులకు 3 గంటల కరెంట్ సరిపోతుందా? అని సిఎం కెసిఆర్ ప్రశ్నించారు. రాహుల్ గాంధీ ధరణిని బంగాళాఖాతంలో కలిపేస్తామంటున్నారు, ధరణి తీసేస్తే రైతుబంధు, ధాన్యం డబ్బులు ఎలా వస్తాయని సిఎం అడిగారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే దళారీల రాజ్యం వస్తోందని పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News