Monday, November 18, 2024

తెలంగాణ కోసం నా వంతు పోరాటం అయిపోయింది: సిఎం కెసిఆర్

- Advertisement -
- Advertisement -

మహబూబ్ నగర్: అచ్చంపేటలో బిఆర్ఎస్ పార్టీ ప్రజా ఆశీర్వాద సభ నిర్వహించింది. ప్రజా ఆశీర్వాద సభకు ముఖ్యమంత్రి కెసిసిఆర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా సిఎం కెసిఆర్ మాట్లాడుతూ…. తెలంగాణ ప్రయాణం పదో సంవత్సరంలో ఎన్నికలు వచ్చాయి. తెలంగాణ కోసం 24 ఏళ్ల క్రితం ఒంటరిగానే ప్రయాణం ప్రారంభిచానని చెప్పారు. తెలంగాణ కోసం నేను పోరాడుతున్నప్పుడు ఈ నేతలంతా ఎవరి కాళ్ల దగ్గర ఉన్నారో తెలియదన్నారు. పాలమూరు జిల్లాలో గతంలో గంజి, అంబలి, కేంద్రాలు ఉండేవని కెసిఆర్ గుర్తుచేశారు.

పాలమూరు ప్రజలు బొంబాయి వలస పోయినప్పుడు ఎవరైనా వచ్చారా? అని సిఎం ప్రశ్నించారు. తెలంగాణ కోసం నావంతు పోరాటం అయిపోయింది.. ఇక చేయాల్సింది ప్రజలేనన్నారు. నా పొరాటంలో నిజాయితీ ఉంది కాబట్టే.. విజయంతం అయ్యానని ధీమా వ్యక్తం చేశారు. పదేళ్ల క్రితం తెలంగాణ ఎలా ఉండేదో ప్రజలు గుర్త చేసుకోవాలని సూచించారు. సరిపడా కరెంట్ లేక, తాగునీరు సాగునీరు లేక ఎన్నో కష్టాలు పడ్డామన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News