Monday, January 20, 2025

తెలంగాణ ప్రజల హక్కుల కోసమే బిఆర్ఎస్ పుట్టింది: సిఎం కెసిఆర్

- Advertisement -
- Advertisement -

కామారెడ్డిలో భారత రాష్ట్ర సమితి నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభలో ముఖ్యమంత్రి కెసిఆర్ ఎాల్గొన్నారు. కామారెడ్డిలో విద్యాసంస్థలు, అనేక పరిశ్రమలు తీసుకువస్తాం.. మీరు ఊహించని అనేక అభివృద్ధి పనులు చేపడతామని కెసిఆర్ తెలిపారు. కామారెడ్డి రూపరేఖలు మారుతాయన్నారు. కామారెడ్డిని అద్భుత నియోజకవర్గంగా మార్చి చూపుతానని పేర్కొన్నారు.

ప్రజాస్వామ్యంలో ప్రజలకు ఉండే ఆయుధం ఓటు అన్నారు. తమాషాగా ఓటు వేస్తే మన తలరాత మారుతుంది, విచక్షణా జ్ఞానంతో ఆలోచించి ప్రజలు ఓటు వేయాలని పిలుపునిచ్చారు. పార్టీలు, అభ్యర్థులను చూసి ప్రజలు ఓటు వేయాలన్నారు. ఎన్నికల్లో ప్రజలు గెలిచే పరిస్థితి భారత్ లో రావాలని ఆయన ఆకాంక్షించారు. తెలంగాణ ప్రజల హక్కుల కోసమే బిఆర్ఎస్ పుట్టిందన్నారు. దేశంలో 16 రాష్టాల్లో బిడి కార్మికులు ఉన్నారు. పార్టీల వైఖరిపై గ్రామాల్లో చర్చ జరగాలని తెలిపారు. సమైక్య రాష్ట్రంలో వ్యవసాయాన్ని నాశనం చేశారని కెసిఆర్ మండిపడ్డారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News