Monday, January 20, 2025

బిజెపికి ఒక్క ఓటైనా ఎందుకు వేయాలి: కెసిఆర్

- Advertisement -
- Advertisement -

కామారెడ్డి: తెలంగాణ రాష్ట్రంలో మూడు గంటల విద్యుత్ చాలని కాంగ్రెస్ చెబుతోందని, మోడీ స్వరాష్ట్రంలో కూడా 24 గంటల విద్యుత్ రావట్లేదని ముఖ్యమంత్రి కెసిఆర్ ఆరోపించారు. మోటార్లకు మీటర్లు పెట్టాలని కేంద్రం నిబంధన తెచ్చిందన్నారు. రాష్ట్రానికి రావాల్సిన రూ. 25 వేల కోట్లను కేంద్ర ప్రభుత్వం కోత పెట్టిందని కెసిఆర్ వివరించారు. రాష్ట్రానికి ఒక్క నవోదయ పాఠశాల ఇవ్వలేదు, ఒక్క పాఠశాల ఇవ్వని బిజెపికి ఒక్క ఓటైనా ఎందుకు వేయాలని ఆయన ప్రశ్నించారు. 108 వైద్య కళాశాలలు ఏర్పాటు చేస్తే రాష్ట్రానికి ఒక్కటీ ఇవ్వలేదని కెసిఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కామారెడ్డిలో బిఆర్ఎస్ గురువారం నిర్వహించిన ప్రజాఆశీర్వాద సభలో సిఎం కెసిఆర్ పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News