Monday, January 20, 2025

ఆ హక్కు సిఎంకు కూడా లేదు: కెసిఆర్

- Advertisement -
- Advertisement -

కామారెడ్డి: తెలంగాణ ఏర్పడ్డాక ధరణి పోర్టల్ తీసుకువచ్చామని ముఖ్యమంత్రి కెసిఆర్ తెలిపారు. కామారెడ్డిలో బిఆర్ఎస్ ఏర్పాటు చేసినప్రజా ఆశీర్వాద సభలో కెసిఆర్ పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన కాంగ్రెస్, బిజెపిలపై సంచలన వ్యాఖ్యల చేశారు. రైతు బోటనవేలు పెడితేనే భూ మార్పిడి జరుగుతుందన్నారు. భూ మార్పిడి చేసే హక్కు సిఎంకు కూడా లేదని స్పష్టం చేశారు. రైతుబంధు నిధులు నేరుగా రైతుల ఖాతాల్లో జమ చేస్తున్నామన్నారు. ధరణి తొలగిస్తే రైతుబంధు, రైతుబీమా ఎలా వస్తుందని ఆలోచించాలన్నారు. ధరణిని బంగాళాఖాతంలో వేయాలని ఆరోపిస్తున్నారు. ధరణిని బంగాళాఖాతంలో వేయాలన్న వారిని అక్కడే వేయాలన్నారు.

వచ్చిన తెలంగాణను విచ్చిన్నం చేయాలని చూస్తున్నారు. బిఆర్ఎస్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేయాలని ప్రయత్నించారని ఆరోపించారు. ఎమ్మెల్యేల కొనుగోలుకు వచ్చిన వ్యక్తే కామారెడ్డిలో నాపై పోటీకి వచ్చారన్నారు. తెలంగాణలో రాజకీయ అస్థిరత తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నాం.. వ్యవసాయాన్ని స్థిరీకరించే విధానాలతో ముందుకెళ్తున్నామని కెసిఆర్ వెల్లడించారు. రూ. 50 లక్షలతో పట్టుబడ్డ వ్యక్తే కామారెడ్డిలో నాపై పోటీకి వస్తారట అని కెసిఆర్ ఎద్దేవా చేశారు. వచ్చిన తెలంగాణను బతకనీయవద్దని చూశారన్నారు. కామారెడ్డిలో కాంగ్రెస్ కు బుద్ధి చెప్పాలని ప్రజలను కోరారు. రైతులను కడుపులో పెట్టుకుని కాపాడుకుంటానని కెసిఆర్ పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News