Monday, January 20, 2025

ఓటును సరిగ్గా వాడతే మంచి భవిష్యత్

- Advertisement -
- Advertisement -

ఖమ్మం: ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల గుణగణాలు పరిశీలించి ఓటేయాలని ముఖ్యమంత్రి కెసిఆర్ పిలుపునిచ్చారు. అభ్యర్థి వెనుక ఉన్న పార్టీ గురించి కూడా ఆలోచన చేయాలన్నారు. ఖమ్మంలో బిఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో సిఎం కెసిఆర్ పాల్గొన్నారు. ఖమ్మం చాలా చైతన్యమైన ప్రాంతం, ఖమ్మం ఎలా అభివృద్ధి చెందిందో మీరు స్వయంగా చూశారని ఆయన తెలిపారు. మన దేశంలో ప్రజాస్వామ్య పరిణితి ఇంకా రాలేదని పేర్కొన్నారు.

ఎన్నికల్లో పార్టీలు పోటో చేయడం గెలుపోటములు సహజమని, ప్రజాస్వామ్య పరిణితి రావాలంటే యువత ముందుకు రావాలని కోరారు. ఓటర్లు పరిణితితో ఓటేస్తే.. ప్రజాస్వామ్యం గెలుస్తోందని వెల్లడించారు. ఓటును సరిగ్గా వాడితే మంచి భవిష్యత్ ఉంటుందన్నారు. 70 ఏళ్ల క్రితం ఖమ్మం కవి రావెళ్ల వెంకట్రామారావు తెలంగాణపై పాట రాశారు. నా తల్లి తెలంగాణరా.. నందనోద్యానమమ్మురా అని ఖమ్మం కవి రావెళ్ల పాటను గురించి కెసిఆర్ ప్రస్తావించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News