Thursday, December 26, 2024

తుమ్మలను గెలిపిస్తే తుమ్మ ముళ్లు గుచ్చుకుంటాయి.. మీఇష్టం

- Advertisement -
- Advertisement -

ఖమ్మం: మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ కృషితోనే ఖమ్మం అభివృద్ధి చెందిందని ముఖ్యమంత్రి కెసిఆర్ తెలిపారు. ఖమ్మం బిఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో సిఎం పాల్గొని మాట్లాడారు. వాడ వాడలో పువ్వాడ అని పత్రికల్లో వార్తలు వచ్చేవి. ఖమ్మం ఎలా అభివృద్ధి చెందిందో మీరు స్వయంగా చూశారని ప్రజలకు చెప్పారు. పువ్వాడను గెలిపిస్తే మిమ్మల్ని పువ్వుల్లో పెట్టి చూసుకుంటారని చెప్పారు. పువ్వాడ పువ్వులు కావాలా..? తుమ్మల తుప్పులు కావాలా? అని కెసిఆర్ ప్రశ్నించారు.
తుమ్మలను గెలిపిస్తే తుమ్మ ముళ్లులు గుచ్చుకుంటాయి.. మీ ఇష్టం అన్నారు. ప్రభుత్వ విజన్.. పువ్వాడ మిషన్ తోనే ఖమ్మం అభివృద్ధి సాధ్యమైందని స్పష్టం చేశారు. కెసిఆర్ బతికి ఉన్నత వరకూ తెలంగాణ సెక్యులర్ రాజ్యంగానే ఉంటుందని ఆయన పేర్కొన్నారు. అజయ్ చేతిలో ఓడిపోయి మూలనపడి ఉంటే తుమ్మలను పిలిచి మంత్రి పదవి ఇచ్చానని కెసిఆర్ గుర్తు చేశారు. తుమ్మల వల్ల ప్రజలకు జరిగిన మేలు శూన్యం అన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News