Sunday, November 24, 2024

వచ్చేది బిఆర్ఎస్ ప్రభుత్వమే.. నేనే వచ్చి ప్రారంభిస్తా

- Advertisement -
- Advertisement -

కొత్తగూడెం: సమైక్య రాష్ట్రం ఉంటే కొత్తగూడెం జిల్లా వచ్చేది కాదని ముఖ్యమంత్రి కెసిఆర్ వెల్లడించారు. కొత్తగూడెంలో బిఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో సిఎం కెసిఆర్ పాల్గొన్నారు. అనంతరం సభలో సిఎం మాట్లాడుతూ… కొత్తగూడేనికి ప్రభుత్వ వైద్య కళాశాల వచ్చింది. కొత్తగూడెం నియోజకవర్గంలో 13,500 ఎకరాల పోడు భూమికి పట్టాలిచ్చామని తెలిపారు. 50ఏళ్ల కాంగ్రెస్ పాలనలో కాని పనులు బిఆర్ఎస్ ప్రభుత్వం చేసి చూపించిందని వెల్లడించారు. సీతారామా ప్రాజెక్టు 70 శాతం పూర్తయిందన్న కెసిఆర్ వచ్చేది బిఆర్ఎస్ ప్రభుత్వమే.. నేనే వచ్చి సీతారామా ప్రాజెక్టు ప్రారభిస్తానని చెప్పారు.

ఎన్నికలు వచ్చాయంటే బూతులు తిట్టుకుంటున్నారు, అబద్దాలు చెబుతున్నారని ఆయన ఆరోపించారు. ఎన్నికలు వస్తే గందరగోళ పరిస్థితి వస్తోందన్నారు. అభ్యర్థి గుణగణాలు చూసి ఓటు వేయాలని సూచించారు. అభ్యర్థి వెనుక పార్టీ ఉంటుంది.. పార్టీ వైఖరి, చరిత్ర చూసి ఓటు వేయాలని కెసిఆర్ ప్రజలను కోరారు. కాంగ్రెస్ పరిపాలనలో సింగరేణి నష్టాల్లో ఉండేది, తెలంగాణ వచ్చిన వెంటనే శాతం ఇంక్రిమెంట్ ఇచ్చామని తెలిపారు. కాంగ్రెస్ హయాంలో కంపెనీ టర్నోవర్ రూ. 11 వేల కోట్లు ఉండేదని సిఎం కెసిఆర్ పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News