Monday, January 20, 2025

ప్రజల ఓటే వజ్రాయుధం: సిఎం కెసిఆర్

- Advertisement -
- Advertisement -

సిర్పూర్ : ఎన్నికల వేళ ప్రజలు విచక్షణతో ఓటు వేయాలని ముఖ్యమంత్రి కెసిఆర్ పిలుపునిచ్చారు. కొమరంభీం జిల్లాలోని సిర్పూర్ నియోజకవర్గంలో భారత రాష్ట్ర సమితి బుధవారం ప్రజా ఆశీర్వాద సభ నిర్వహించింది. ఈ కార్యక్రమంలో కెసిఆర్ పాల్గొన్నారు. అనంతరం సభలో సిఎం మాట్లాడుతూ… రైతులు, పేదల గురించి ఆలోచించే వారికి ఓటు వేయాలని ప్రజలను కోరారు. ప్రజాస్వామ్య ప్రక్రియలో పరిణితి రావాలని ఆకాంక్షించారు. ప్రజల వద్ద ఉన్న ఓటే వజ్రాయుధం అన్న సిఎం ఎన్నికల్లో సేవ చేసే వ్యక్తులకు ఓటు వేయాలన్నారు. మనం వేసే ఓటు… భవిష్యత్తును నిర్ణయిస్తోందన్నారు. 2004 ఎన్నికలకు ముందు తెలంగాణ ఇస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది.

ఎన్నికలు అవ్వగానే కాంగ్రెస్ ఇచ్చిన హామీని విస్మరించిందని ఆరోపించారు. తెలంగాణ వచ్చుడో.. కెసిఆర్ వచ్చుడో అన్నట్లు నేను పోరాడానని చెప్పారు. బిఆర్ఎస్ పోరాటానికి భయపడి కాంగ్రెస్ నేతలు ప్రత్యేక తెలంగాణ ఇచ్చారన్నారు. రాష్టంలో తండాలకు సైతం శుద్ధమైన నీరు వస్తున్నాని చెప్పారు. దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో 24 గంటల కరెంట్ ఇస్తున్నామని కెసిఆర్ పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News