Sunday, January 19, 2025

400 మందిని కాంగ్రెస్ కాల్చి చంపింది

- Advertisement -
- Advertisement -

బోథ్: రానున్న ఎన్నికల్లో ప్రజలు ఆలోచించి అభ్యర్థులకు ఓటు వేయాలని ముఖ్యమంత్రి కెసిఆర్ పిలుపునిచ్చారు. ప్రజలు బోథ్ లో భారత రాష్ట్ర సమితి ప్రజా ఆశీర్వాద సభ నిర్వహిస్తోంది. ఈ సభలో కెసిఆర్ పాల్గొని ప్రసంగించారు. ఎన్నికల్లో ప్రజలు గెలవాలన్నారు. ప్రజాస్వామ్య ప్రక్రియలో పరిణితి రావాలని ఆయన ఆకాంక్షించారు. ప్రజలకు ఉన్న ఏకైక ఆయుధం ఓటు అన్నారు. బిఆర్ఎస్ చేసిన అభివృద్ధిని కార్యకర్తలు.. ప్రజలకు వివరించాలని కోరారు. బిఆర్ఎస్ పుట్టిందే తెలంగాణ కోసమని తెలిపారు. 1969 ఉద్యమంలో 400 మందికి కాంగ్రెస్ కాల్చి చంపిందన్నారు. తెలంగాణ వచ్చుడో… కెసిఆర్ చచ్చుడో అన్నట్లు పోరాటం చేశానని ఆయన వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News