- Advertisement -
కొత్తగూడెం: ముఖ్యమంత్రి కెసిఆర్ వరస ఎన్నికల ప్రచారాలతో పార్టీ నేతల్లో, కార్యకర్తల్లో జోష్ పెంచుతున్నారు. కొత్తగూడెంలో బిఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో సిఎం కెసిఆర్ పాల్గొన్నారు. ఎన్నికలు వచ్చాయంటే బూతులు తిట్టుకుంటున్నారు, అబద్దాలు చెబుతున్నారని సిఎం కెసిఆర్ అన్నారు. ఎన్నికలు వస్తే గందరగోళ పరిస్థితి వస్తోందని ఆయన తెలిపారు. అభ్యర్థి గుణగణాలు చూసి ఓటు వేయాలని సిఎం సూచించారు. అభ్యర్థి ఎనుక పార్టీ ఉంటుంది.. పార్టీ వైఖరి, చరిత్ర చూసి ఓటు వేయాలని కెసిఆర్ ప్రజలను కోరారు. కాంగ్రెస్ పరిపాలనలో సింగరేణి నష్టాల్లో ఉండేది, తెలంగాణ వచ్చిన వెంటనే శాతం ఇంక్రిమెంట్ ఇచ్చామని ఆయన పేర్కొన్నారు.
- Advertisement -