- Advertisement -
రాష్ట్రంలో ఎన్నికల వేడి రాజుకుంటోంది. ఆయా పార్టీలు అభ్యర్ధుల వేటలో తలమునకలయ్యాయి. కానీ బిఆర్‌ఎస్ అన్ని పార్టీల కంటే ముందుగా ఎన్నికల రేసులో దూసుకుపోతోంది. ఈ మేరకు ఆ పార్టీ తరపున పోటీ చేసే అభ్యర్ధుల జాబితా ప్రకటించేందుకు రంగం సిద్ధమైంది. మరికాసేపట్లో తెలంగాణ భవన్ లో బిఆర్ఎస్ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు మీడియా సమావేశం నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా 96 నుంచి 105 మందితో కూడిన అభ్యర్థుల జాబితాను కేసీఆర్ అధికారికంగా ప్రకటించే అవకాశం వుందని తెలుస్తోంది.
దాదాపు సిట్టింగులకే సీట్లు ఖరారయ్యే అవకాశం ఉందని, కొన్ని చోట్ల అవసరం మేరకే అభ్యర్థుల మార్పుజరుగుతుందని కూడా విశ్వసనీయ సమాచారం. కాగా, 2018లో సెప్టెంబర్ 6న జాబితాను విడుదల చేయగా, ఈసారి 15రోజుల ముందుగానే జాబితాను విడుదల చేస్తున్నారు.
- Advertisement -