Wednesday, January 22, 2025

ఆ నాడు మహబూబ్‌నగర్‌ను చూస్తే కన్నీళ్లు వచ్చేవి

- Advertisement -
- Advertisement -

జడ్చర్ల: ఆ నాడు మహబూబ్‌నగర్‌ను చూస్తే కన్నీళ్లు వచ్చేవని ముఖ్యమంత్రి కెసిఆర్ అన్నారు. మహబూబ్ నగర్ జిల్లా.. గత ఉద్యమ సందర్భంలో ఏ మూలుకు పోయినా.. ఏ ప్రాంతానికి పోయినా ఎప్పుడు కూడా దుఖంతో పోయేది… కల్లలో నీళ్లు వచ్చేవి. ఆ రోజుల్లో ప్రొఫెసర్ జయశంకర్ బతికే ఉండే.. నాతో పాటు తిరుగుతుండే. ఆనాడే చెప్పాడు. మహబూబ్ నగర్ దరిద్రం పోవాలంటే అక్కడ నుంచి మీరు ఖచ్చితంగా ఎంపిగా పోటీ చేయాలె. ప్రజలు మిమ్మల్ని ఓడగొట్టరు గెలిపిస్తరు … అప్పుడు మీకు అనుభవం వస్తది అని చెబితే నేను ఇక్కడి నుంచి ఎంపిగా పోటి చేసిన. అనాడు లక్ష్మారెడ్డి తన వెంట ఉండి గెలిపించాడని సిఎం చెప్పారు.

ఏ రోజుకైనా పాలమూరు చిరిత్రతో కీర్తి శాశ్వతంగా ఉంటది… నేను 15 ఏండ్లు పోరాటం చేసినప్పటికీ నేను మహబూబ నగర్ ఎంపిగా ఉంటూనే తెలంగాణ రాష్ట్రం సాధించిన విసయం కూడా చిరస్దాయిగా ఉంటుంది… ఒక నాడు జయశంకర్ నేను నారాయణపేట ప్రాంతం పోయి మహబూబ్ నగర్ గూండా రోడ్డు మార్గాన వెళ్తుంటే నవాబుపేట మద్యలో చిన్న అడవి ఉంది. అడవిలో లైట్లులో చూసిన చెట్లని చూసి అనుకున్నాం, మనుసులు కాదు చివిరికి మహబూబ్ నగర్‌లో అడవి కూడా బక్కచిక్కిపోయాయని ,చూసుకుంటూ బాదపడకుంటూ వచ్చినం… ఒక్క గోస కాదు మహబూబ్ నగర్ అనేక సందర్భల్లో కల్లోనీ నళ్లు వచ్చినాయి.

మహబూబ్ నగర్‌లో గంజి కేంద్రాలు, అంబలి కేంద్రాలు పెడ్తుంటే గుండెలు అలిసేలా బాధకల్గేది. ఏమి దుర్గతి పట్టిందని, పక్కనే కృష్ణానది పారుతున్నా అవకాశాలు ఉన్నా కూడా ముఖ్యమంత్రులు రావడం, దత్తత తీసుకోవడం, నాటకాలు అడడం, శిలాఫలకాలు వేయడం తప్ప ఏమి లాభం జరగలేదు. ఉద్యమంలో నేనే పాట రాసినా, పక్కనే కృష్ణమ్మ ఉన్నా ఫలితమేమి లేక పోయే.. పాలమూరు నల్గగొండ ఖమ్మం మెట్టు పంటలెండి అని రాసిన. మహబూబ్ నగర్ నా గుండెల్లో ఉంది. బాధలు,. దుఖం ఎక్కువ ఉన్నది. మొట్టమొదటిసారిగా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత లకా్ష్మరెడ్డి తన క్యాబినెట్‌లో మంత్రిగా ఉండె. వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా ఉండే ఈ రోజు వచ్చిన డయాగ్నిస్ సెంటర్లు కూడా లకా్ష్మరెడ్డి పున్యమే. ఆ రోజు నెలల పాటు కింద మీద పడ్డాం. ఎక్కడ నుంచి నీళ్లు తీసుకు రావాలని.. కృష్ణా జలాల్లో మనకు రవాల్సిన వాట కోసం నెలల తరబడి ఆలోచించామని ఆయన వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News