మేడ్చల్: మేడ్చల్ జిల్లాలో కలెక్టరేట్ భవనం ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందని ముఖ్యమంత్రి కెసిఆర్ అన్నారు. బుధవారం మేడ్చల్ సమీకృత కలెక్టరేట్ భవనాన్ని సిఎం కెసిఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…. మేడ్చల్ జిల్లా అవుతుందని ఎవరూ అనుకోలేదన్నారు. తెలంగాణ ఏర్పాటు వల్లే ఇది సాధ్యమైందన్నారు. పరిపాలన.. ప్రజలకు ఎంత దగ్గరకు వస్తే అంత చక్కగా పనులు జరుగుతాయని తెలిపారు. పరిపాలన సౌలభ్యం కోసమే కొత్త జిల్లాల ఏర్పాటు జరిగిందని సిఎం పేర్కొన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న మంచి కార్యక్రమాలు ప్రజలకు త్వరగా చేరుతున్నాయన్నారు. తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 10 లక్షల పింఛన్లు అందిస్తున్నాం. మొత్తం 46 లక్షల మందికి కొత్త కార్డులు అందిస్తున్నామని ఆయన వెల్లడించారు. అందిరికీ కొత్త కార్డులు అందిస్తున్నామన్నారు. తెలంగాణ వచ్చాక ఎన్నో మంచి పనులు జరుగుతున్నాయని తెలిపారు. ఈ రోజు 24 గంటల నాణ్యమైన విద్యుత్ అందిస్తున్నామని కెసిఆర్ పేర్కొన్నారు. దేశంలో అసమర్ధ విధానాలతో అనేక ఇబ్బందులు ఉన్నాయి. ఇవాళ ఢిల్లీలో 24 గంటల విద్యుత్ లేని పరిస్థితి ఉందని ముఖ్యమంత్రి పేర్కొన్నారు.
తెలంగాణ ఏర్పాటు వల్లే ఇది సాధ్యమైంది: సిఎం కెసిఆర్
- Advertisement -
- Advertisement -
- Advertisement -