Sunday, January 19, 2025

75 ఏళ్లు గడిచినా.. ఎస్సీల పరిస్థితి బాగాలేదు: సిఎం కెసిఆర్

- Advertisement -
- Advertisement -

సత్తుపల్లి: ఖమ్మం జిల్లాలోని సత్తుపల్లిలో భారత రాష్ట్ర సమితి ప్రజా ఆశీర్వాద సభను నిర్వహించింది. ప్రజా ఆశీర్వాద సభలో ముఖ్యమంత్రి కెసిఆర్ పాల్గొన్నారు. అనంతరం సిఎం సభలో మాట్లాడుతూ… ఎవరిని గెలిపిస్తే.. ఏం జరుగుతుందో ప్రజలు ఆలోచించాలన్నారు. దళితబంధు అనే పదం పుట్టించిందే కెసిఆర్ అన్నారు. కెసిఆర్ కంటే ముందు ఎవరైనా దళితబంధు గురించి ఆలోచించారా? అని ప్రశ్నించారు. 75 ఏళ్లు గడిచినా.. ఎస్సీల పరిస్థితి బాగాలేదని కెసిఆర్ ఆవేదన వ్యక్తం చేశారు.

ఎస్సీలు ఎప్పటికీ అలాగే ఉండాల్సిందేనా? అని కెసిఆర్ అన్నారు. అన్ని పార్టీలు ఎస్సీలకు దశాబ్దాలుగా ఓటుబ్యాంకుగానే చూశాయని ఆయన మండిపడ్డారు. ఉత్తర భారత్ లో ఇప్పటికీ ఎస్సీలపై నిత్యం దాడులు జరుగుతున్నాయని కెసిఆర్ తెలిపారు. సిద్దిపేట ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే దళితజ్యోతి అనే కార్యక్రమం అమలు చేశానని ఆయన వెల్లడించారు. దళితబంధుకు స్ఫూర్తి… ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అమలు చేసిన దళితజ్యోతి అని కెసిఆర్ పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News