రంగారెడ్డి: రైతు బంధు, రైతు భీమా వంటి పథకాలు ఎక్కడా లేదని కొంగరకలాన్ లో నిర్వహించిన బహిరంగ సభలో సిఎం కెసిఆర్ అన్నారు. దేశంలోని ఎక్కడ లేనివిధంగా రాష్ట్రంలో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని పేర్కొన్నారు. రైతులు పండించే ధాన్యం ప్రభుత్వమే కొనుగోలు చేస్తుంది. రైతులు అప్పులు తీసుకును అవసరం లేకుండా రైతుబంధు ఎకరానికి రూ.10 వేలు అందిస్తున్నామని ఆయన వెల్లడించారు. నీటి తీరువా బకాయిలు రద్దు చేసి ప్రాజెక్టుల ద్వారా నీళ్లు సరఫరా చేస్తున్నాం. రైతులకు ఉచితంగా విద్యుత్ అందిస్తున్నామని ముఖ్యమంత్రి తెలిపారు. ఉమ్మడి ఏపిలో ఉన్నప్పుడు ఇలాంటి సదుపాయాలు వస్తాయని రైతులు కలలో కూడా ఊహించేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సుదపాయాలు కాపాడుకోవాలా? వద్దా? అనేది ప్రతి ఒక్కరూ ఆలోచించాలన్నారు. పంటలు పండే తెలంగాణ కావాలా? మత పిచ్చితో మంటలు మండే తెంగాణ కావాలా? అని ప్రశ్నించారు. పంటలు పండే తెలంగాణ కావాలి… మంటలు మండే తెలంగాణ వద్దనే భావన అందరిలో ఉండాలని ముఖ్యమంత్రి కెసిఆర్ సూచించారు.
రైతులు కలలో కూడా ఊహించలేదు: సిఎం కెసిఆర్
- Advertisement -
- Advertisement -
- Advertisement -