Wednesday, December 25, 2024

సిఎం బహిరంగ సభకు బిఆర్‌ఎస్ శ్రేణులు

- Advertisement -
- Advertisement -

కుంటాల : నిర్మల్ జిల్లా కేంద్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ నూతన సమీకృత కలెక్టర్ భవన ప్రారంభం, పలు అభివృద్ది పనులకు విచ్చేసి భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయడంతో ఆదివారం కుంటాల మండలంలోని ఆయా గ్రామాల నుంచి బిఆర్‌ఎస్ నాయకులు పెద్ద ఎత్తున తరలివెళ్లారు. ఈ సందర్బంగా బీఆర్‌ఎస్ నాయకులు కల్లూర్, భైంసా 61వ జాతీయ రహదారిపై జై తెలంగాణ, జై కేసీఆర్ అంటూ నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో బిఆర్‌ఎస్ మండల కన్వీనర్ పడకంటిదత్తు, బిఆర్‌ఎస్ నాయకులు, ప్రజా ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News