సిర్పూర్ : రాష్ట్రంలో ఒక్కొక్క విద్యార్థిపై రూ.1.25 లక్షలు ఖర్చుపెడుతున్నామని సిర్పూర్ లో బిఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో సిఎం కెసిఆర్ అన్నారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత భూముల ధరలు పెరిగాయని తెలిపారు. నీటి సదుపాయాలు కల్పించినందునే భూముల ధరలు పెరిగాయని వెల్లడించారు. రైతులకు ఇబ్బంది ఉండకూడదనే ఉద్దేశంతో రైతుబంధు ఇస్తున్నామన్నారు. పోడుభూముల పట్టాల పంపిణీకి కేంద్రంగా అడ్డంకిగా మారిందని ఆరోపించారు.
రైతుబంధు దుబారా అని కాంగ్రెస్ నేతలు అంటున్నారు. 24 గంటల కరెంట్ ఇవ్వడం వృథా అని రేవంత్ రెడ్డి అంటున్నారని తెలిపారు. వ్యవసాయానికి 24 గంటల కరెంట్ సరిపోతుందా? అని సిఎం ప్రశ్నించారు. భూవివాదాలు ఉండకూడదని ధరణి పోర్టల్ తీసుకొచ్చామన్నారు. కాంగ్రెస్ హయాంలో లంచం ఇస్తేనే రిజిస్ట్రేషన్లు జరిగేవని తెలిపారు. ప్రస్తుతం ఎలాంటి లంచాలు ఇవ్వకుండానే అర్థగంటలోనే రిజిస్ట్రేషన్లు అవుతున్నాయని కెసిఆర్ పేర్కొన్నారు.