Thursday, January 23, 2025

గోదావరి బ్రిడ్జీ వద్ద సిఎం కెసిఆర్ పూజలు

- Advertisement -
- Advertisement -

గోదావరిఖని: మంచిర్యాల నుంచి గోదావరిఖనికి వెళ్లే బ్రిడ్జీపై నుంచి గోదావరి నదికి సిఎం కెసిఆర్ శుక్రవారం సాయంత్రం ప్రత్యేక పూజలు నిర్వహించారు. శుక్రవారం మంచిర్యాల జిల్లాలో పర్యటించిన ముఖ్యమంత్రి కెసిఆర్ తిరుగు ప్రయాణ సమయంలో పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలోని గోదావరి బ్రిడ్జీపై ఆగి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ముఖ్యమంత్రి కెసిఆర్‌కు కలెక్టర్ డాక్టర్ ఎస్.సంగీత సత్యనారాయణ, అదనపు కలెక్టర్‌లు వి.లక్ష్మినారాయణ, కుమార్ దీపక్‌లు ఘన స్వాగతం పలికారు. గోదావరి నదిలోకి పూలను జల్లి, హారతి ఇచ్చి సిఎం కెసిఆర్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో నిర్మించుకున్న సాగునీటి ప్రాజెక్ట్‌ల ఫలితంగా 365 రోజుల పాటు మండు టెండలోనూ గోదావరి నది సజీవంగా ఉండటం పట్ల సి ఎం కెసిఆర్ సంతృప్తి వ్యక్తం చేశారు. కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి కొప్పుల ఈశ్వర్‌తోపాటు పలువురు మంత్రులు, రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్‌తోపాటు పలువురు ఎమ్మెల్యేలున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News