Friday, November 15, 2024

దివ్యాంగుల ఆత్మగౌరవం పెంచిన సీఎం కేసీఆర్

- Advertisement -
- Advertisement -
  • ఎమ్మెల్యే డాక్టర్ తాటికొండ రాజయ్య

స్టేషన్ ఘన్‌పూర్: దివ్యాంగుల పింఛన్‌ను పెంచి వారి ఆత్మ గౌరవాన్ని సీఎం కేసీఆర్ పెంచారని ఎమ్మెల్యే డాక్టర్ తాటికొండ రాజయ్య అన్నారు. స్టేషన్ ఘన్‌పూర్ నియోజకవర్గ కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ముందు రైతు వేదికలో స్టేషన్ ఘన్‌పూర్ నియోజకవర్గస్థాయి దివ్యాంగుల పింఛన్ పెంపు ప్రొసిడింగ్ పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే డాక్టర్ తాటికొండ రాజయ్య ముఖ్యఅతిథిగా పాల్గొని దివ్యాంగులకు రూ. 4016 పింఛన్ పెంపు మంజూరు పత్రాలు అందచేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పనిచేయడానికి సహకరించని అంగవైకల్యం, సమాజంలో చిన్నచూపు, ఏది కావాలన్నా ఇతరులపై ఆధారపడటం, ఇటువంటి అసహాయులైన దివ్యాంగులకు రాష్ట్ర ప్రభుత్వం ఎంతో తోడ్పాటు అందిస్తూ సీఎం కేసీఆర్ దివ్యాంగులకు ఆసరాగా ఇచ్చే ఆసరా పింఛన్ రూ. 3016 నుంచి రూ. 4016కు పెంచారన్నారు. 2014కు ముందు రూ. 500 ఉన్న పింఛన్ తొమ్మిదేళ్లలో ఎనిమిదింతలు పెరిగిందన్నారు.

స్టేషన్ ఘన్‌పూర్ నియోకవర్గంలో 5559 మంది దివ్యాంగులకు లబ్ధి చేకూరుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీలు, జడ్పీటీసీలు, మండల పార్టీ అధ్యక్షులు, సర్పంచులు, ఎంపీటీసీలు, నాయకులు, సంబంధిత శాఖల అధికారులు, మహిళా నాయకులు, దివ్యాంగులు, బీఆర్‌ఎస్ శ్రేణులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News