Thursday, January 23, 2025

సిఎం కెసిఆర్ రంజాన్ శుభాకాంక్షలు

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్ : ముస్లింల పవిత్ర పండుగ రంజాన్(ఈద్ ఉల్ ఫి తర్) సందర్భంగా ముఖ్యమంత్రి కె.చం ద్రశేఖర్ రావు శుభాకాంక్షలు తెలియజే శారు. ఈద్ ఉల్ ఫితర్ పర్వదిన వేడుకలను సంతోషంగా జరుపుకోవాలని, పవిత్ర ప్రార్థనలతో అల్లా దీవెనలు పొందాలని ఈ సందర్భంగా ఆయన ఆకాంక్షించారు. రంజాన్ మాసంలో క్రమం తప్పకుండా ఆచరించే ఉపవాసం, దైవ ప్రార్థనలు.. క్రమశిక్షణతో కూడిన జీవనశైలిని, ఆధ్యాత్మికతను పెంపొందిస్తుందని సిఎం అన్నారు. మానవ సేవ చేయాలనే సందేశాన్ని రంజాన్ పండుగ సమస్త మానవాళికి అందిస్తుందని సిఎం అన్నారు.

గంగా జమునా తెహజీబ్‌కు తెలంగాణ ప్రతీక అని అన్నారు. లౌకిక వాదం, మత సామరస్య పరిరక్షణలో దేశానికే రాష్ట్రం ఆదర్శంగా నిలిచిందని సిఎం స్పష్టం చేశారు. ముస్లిం మైనారిటీల అభ్యున్నతి కోసం రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తున్నదన్నారు. వారి సంక్షేమానికి ప్రతి ఏటా భారీగా నిధులు కేటాయించి, ఎన్నో కార్యక్రమాలు అమలు చేస్తున్నదన్నారు. షాదీ ముబారక్ పథకం ద్వారా ఆడ పిల్లల పెండ్లి ఖర్చుల కోసం 1 లక్ష 116 రూపాయల సాయం అందిస్తోందన్నారు. దీని ద్వారా ముస్లిం పేదింటి ఆడపిల్లల కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం ఆర్థికంగా చేయూత నందిస్తున్నదని సిఎం కెసిఆర్ తెలిపారు.

అలాగే మైనారిటీ యువతకు ప్రత్యేక శిక్షణనిచ్చి రాష్ట్ర ప్రభుత్వం స్వయం ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నదన్నారు. మైనారిటీ విద్యార్థులకు గురుకులాల ద్వారా అంతర్జాతీయ స్థాయి నాణ్యమైన విద్యను అందిస్తున్నదన్నారు. ఓవర్‌సీస్ స్కాలర్ షిష్‌ల ద్వారా ముస్లిం విద్యార్థుల విదేశీ విద్యకు రాష్ట్ర ప్రభుత్వం బాటలు వేస్తున్నదని సిఎం కెసిఆర్ పేర్కొన్నారు. ఎన్ని కష్టాలు ఎదురైనా రాష్ట్ర ప్రభుత్వం మత సామరస్యాన్ని కాపాడుతుందన్నారు. లౌకిక వాద విఘాత శక్తుల పట్ల రాష్ట్ర ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుందని సిఎం పునరుద్ఘాటించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News