Sunday, December 22, 2024

జగిత్యాలకు చేరుకున్న కెసిఆర్

- Advertisement -
- Advertisement -

జగిత్యాల న్యూస్: సిఎం కెసిఆర్ జగిత్యాల జిల్లాకు చేరుకున్నారు. కలెక్టరేట్ లోని హెలిప్యాడ్ వద్ద ఆయనకు మంత్రులు, ఎమ్మేల్యేలు, ప్రజాప్రతినిధులు, అధికారులు ఘన స్వాగతం పలికారు. మొదట తెలంగాణ భవన్, మెడికల్ కాలేజ్ తరువాత కలెక్టరేట్ భవన్ సముదాయాన్ని సిఎం కెసిఆర్ ప్రారంభించనున్నారు. తదనంతరం అధికారులతో నూతన కలెక్టరేట్ లో రివ్యూ మీటింగ్ లో పాల్గొనే అవకాశం ఉంది.

మధ్యాహ్నం 3 గంటలకు ప్రత్యేక బస్సు ద్వారా సిఎం కెసిఆర్ రోడ్డు మార్గాన మోతే గ్రామంలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగసభకు చేరుకుంటారు. అక్కడ ప్రజలను ఉద్దేశించి సిఎం ప్రసంగించనున్నారు. సాయంత్రం 4 గంటలకు అక్కడి నుండి హెలికాప్టర్ ద్వారా ఎర్రవెల్లిలోని తన ఫామ్ హౌజ్ కు బయలుదేరుతారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News