Thursday, January 23, 2025

దేశ ప్రజాస్వామ్య చరిత్రలో నేడు చీకటి రోజు: సిఎం కెసిఆర్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ నాయకుడు రాహుల్ గాంధీ అనర్హత వేటుపై రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు స్పందిస్తూ.. దేశ ప్రజాస్వామ్య చరిత్రలో నేడు చీకటి రోజు అని పేర్కొన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ దురంహంకారానికి, నియంతృత్వానికి పరాకాష్ట అని, మోడీ పాలన ఎమర్జెన్సీని మించిపోతుందన్నారు. ప్రతిపక్ష నేతలను వేధించడం పరిపాటిగా మారిపోయిందని, బిజెపి దుర్మార్గ విధానాలను ప్రతిఘటించాలన్నారు.

రాహుల్ గాంధీపై అనర్హత అప్రజాస్వామికమని, బిజెపి దుశ్చర్యను ప్రజాస్వామ్యవాదులు ముక్త కంఠంతో ఖండించాలని పేర్కొన్నారు. కాగా, పరువునష్టం కేసులో సూరత్ కోర్టు రెండేళ్ల జైలు శిక్ష విధించడంతో కాంగ్రెస్ పార్టీ ఎంపి రాహుల్ గాంధీని అనర్హుడిగా ప్రకటిస్తూ పార్లమెంట్ శుక్రవారం ఉత్తర్వులు జారీచేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News