Thursday, January 23, 2025

హైదరాబాద్‌లో రాష్ట్రపతి ముర్ముకు సిఎం కెసిఆర్‌తో పాటు ప్రముఖుల స్వాగతం

- Advertisement -
- Advertisement -
నేడు దుండిగల్ ఎయిర్‌ఫోర్స్ అకాడమి కంబైన్డ్ గ్రాడ్యుయేషన్ పరేడ్‌కు హాజరుకానున్న రాష్ట్రపతి

హైదరాబాద్ : దుండిగల్‌లోని ఎయిర్‌ఫోర్స్ అకాడమీ కంబైన్డ్ గ్రాడ్యుయేషన్ పరేడ్‌కు హాజరయ్యేందుకు రాష్ట్రానికి విచ్చేసిన భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు ఘనస్వాగతం లభించింది. ఈ మేరకు శుక్రవారం సాయంత్రం 6.00 గంటలకు ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో బేగంపేట విమానాశ్రయానికి చేరుకున్న రాష్ట్రపతికి రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందర రాజన్, ముఖ్యమంత్రి కెసిఆర్, కేంద్రమంత్రి జి. కిషన్ రెడ్డిలు ఘనంగా స్వాగతం పలికారు. బేగంపేట ఎయిర్‌పోర్టుకు చేరుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు ముఖ్యమంత్రి కెసిఆర్ శాలువా కప్పి పుష్పగుచ్చంతో స్వాగతం పలికారు. అనంతరం ఎంపిలు జోగినపల్లి సంతోష్ కుమార్, వెంకటేశ్ నేత, రాష్ట్ర మంత్రులు మహ్మద్ మహమూద్ అలీ, సబితా ఇంద్రారెడ్డి, సత్యవతి రాథోడ్, చేమకూర మల్లారెడ్డి, జిహెచ్‌ఎంసి మేయర్ గద్వాల విజయలక్ష్మి, ఎంఎల్‌సిలు మధుసూధనా చారి, పల్లా రాజేశ్వర్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, డిజిపి అంజనీకుమార్‌తో పాటు పలువురు రాష్ట్రపతికి స్వాగతం పలికిన వారిలో ఉన్నారు.

శుక్రవారం రాత్రి రాజ్‌భవన్‌లో బస
బేగంపేట విమానాశ్రయం నుంచి నేరుగా రాష్ట్రపతి రాజ్ భవన్‌కు చేరుకున్నారు. శుక్రవారం రాత్రి అక్కడే బస చేశారు. నేడు ఉదయం దుండిగల్ ఎయిర్‌ఫోర్స్‌లో జరిగే పరేడ్‌కు రాష్ట్రపతి ముఖ్యఅతిథిగా హాజరు కానున్నారు. ఈ నేపథ్యంలో ఉదయం 7 గంటలకు రాజ్‌భవన్ నుంచి బేగంపేట విమానాశ్రయానికి, అక్కడి నుంచి రాష్ట్రపతి దుండిగల్‌కు చేరుకుంటారు. పరేడ్ అనంతరం ఉదయం 11.15 గంటల ప్రాంతంలో రాష్ట్రపతి ముర్ము తిరిగి ఢిల్లీకి వెళ్తారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News