Friday, November 22, 2024

మైనార్టీల సంక్షేమం కోసం కెసిఆర్ ఎంతో కృషి చేస్తున్నారు: అక్బరుద్దీన్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: అన్ని జిల్లాల్లో మైనార్టీ స్టడీ సర్కళ్లు ఏర్పాటు చేయాలని ఎంఐఎం ఎంఎల్‌ఎ అక్బరుద్దీన్ డిమాండ్ చేశారు. మైనార్టీ సంక్షేమం, పాతబస్తీలో అభివృద్ధి కార్యక్రమాలపై చర్చ జరిగింది. ఈ సందర్భంగా అక్బరుద్ధీన్ మాట్లాడారు. దేశంలో ముస్లింలు వెనుకబడి ఉన్నారని సచార్ కమిటీ తెలిపిందని గుర్తు చేశారు. సిఎం కెసిఆర్ దృష్టికి ఏ సమస్య తీసుకెళ్లినా పరిష్కరిస్తున్నారని కొనియాడారు. వృతి విద్య శిక్షణ ఇచ్చే సెట్విన్‌ను బలోపేతం చేయాలని కోరారు. వక్ఫ్ బోర్డు భవనాల అద్దెలు చాలా కాలంగా పెంచడం లేదని, వక్ఫ్ బోర్డు భూములు అన్యాక్రాంతమవుతున్నాయని సభకు తెలియజేశారు. సిఎం కెసిఆర్ ముస్లీం మైనార్టీలకు అసలైన స్నేహితుడని పొగిడారు. వక్ఫ్ బోర్డుకు జ్యూడీషియల్ పవర్స్ ఇవ్వాలన్నారు. చరిత్రలో మొదటిసారి హైదరాబాద్ పాతబస్తీ అభివృద్ధి అసెంబ్లీలో చర్చ జరుగుతోందన్నారు. గతంలో పాతబస్తీ అభివృద్ధిని ప్రభుత్వాలు పట్టించుకోలేదని విమర్శించారు. టిఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో పాతబస్తీలో పది వేల కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు జరుగుతున్నాయన్నారు. మైనార్టీల సంక్షేమం కోసం సిఎం కెసిఆర్ ఎంతో కృషి చేస్తున్నారని ప్రశంసించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News