ఎల్లంపల్లి నుండి ఎస్ఆర్ఆర్ రిజర్వాయర్‌కు నీటి తరలింపు
నంది పంపు హౌస్‌లో నీరు ఎత్తిపోతలు
మన తెలంగాణ/ ధర్మారం: వర్షాకాలం ప్రారంభమై నెల రోజులు గడుస్తున్నా వర్షాల జాడ లేకపోవడంతో ఉన్న నీటిని సాగు, తాగు కోసం వాడాలని నిర్ణయించి సిఎం కెసిఆర్ ఇచ్చిన ఆదేశాల మేరకు ఎల్లంపల్లి ప్రాజెక్టు నుండి నంది పంప్‌హౌస్ ద్వారా ఎస్ఆర్ఆర్ రిజర్వాయర్‌కు నీటిని తరలించే ప్రయత్నాలు సోమవారం ఉదయం ప్రారంభించారు. ఎల్లంపల్లి ప్రాజెక్టులో ప్రస్తుతం ఉన్న నీటిని విడుదల చేస్తుండటంతో నంది మేడారంలోని భూగర్భంలో నిర్మించిన నంది పంపుహౌస్‌కు చేరుకోవడంతో వెంటనే నంది పంప్ హౌస్‌లోని రెండు బాహుబలి మోటార్లను రన్ చేయడంతో నంది మేడారం నంది రిజర్వాయర్ డెలివరీ సిస్టం వద్ద నీటిని ఎత్తిపోసే ప్రక్రియ ప్రారంభమైంది.
Also Read: కెసిఆర్ కొట్టే మొగోణ్ణి నేనే….
ఒకోక్క మోటార్ ద్వారా 3150 క్యూసెక్కుల నీటిని ఎత్తిపోస్తున్నరు. 0.54 టీఎంసీల నీటిని నిత్యం తరలిస్తున్నారు. మల్లాపూర్ భూగర్భం ద్వారా రామడుగు మండలం లక్ష్మీపూర్‌కు ఈ నీరు చేరుకుంటాయి, అక్కడి నుండి పంపులు ఎత్తి పోయగానే నేరుగా ఎస్ఆర్ఆర్ రిజర్వాయర్‌కు చేరుకుంటుందని ఇంజనీర్లు తెలిపారు. నీటిపారుదల శాఖ ఇంజనీరింగ్ చీఫ్ నల్ల వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ నూనె శ్రీధర్ పర్యవేక్షణ చేస్తున్నారు. నంది పంప్ హౌస్‌లో ఎల్లంపల్లి నీటిని ఎత్తి పోస్తుండటంతో నీటి అందాలను ప్రజలు తరలి వచ్చి తిలకిస్తున్నారు.