Wednesday, January 22, 2025

తెలంగాణ సాధన కోసం కొండా లక్ష్మణ్ బాపూజీ రాజీలేని పోరాటం చేశారు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: తాను నమ్మిన విశ్వాసంతో తెలంగాణ రాష్ట్ర సాధన కోసం రాజీలేని పోరాటాన్ని నడిపిన కొండా లక్ష్మణ్ బాపూజీ, తెలంగాణ బడుగు, బలహీన వర్గాల చైతన్యానికి ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచారని ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు అన్నారు. బుధవారం కొండా లక్ష్మణ్ బాపూజీ 108వ జయంతి సందర్భంగా.. ఆయన తెలంగాణకు అందించిన సేవలను, చేసిన త్యాగాలను సిఎం కెసిఆర్ స్మరించుకున్నారు. దేశ స్వాతంత్ర్యోద్యమంలో, తెలంగాణ తొలి, మలి దశ ఉద్యమాల్లో ఆయన చేసిన పోరాటం నాటి తరాన్ని ఎంతో ప్రభావితం చేసిందని అన్నారు. ఎమ్మెల్యేగా, డిప్యూటీ స్పీకర్ గా, మంత్రిగా ఎన్నో పదవులను నిర్వహించిన బాపూజీ, తెలంగాణ కోసం మంత్రి పదవిని త్యజించి నిబద్ధత కలిగిన నేతగా చరిత్రలో నిలిచారని సిఎం అన్నారు.

బాపూజీ ఆశయాలను రాష్ట్ర ప్రభుత్వం తన కార్యాచరణ ద్వారా నెరవేరుస్తున్నదని, బడుగు, బలహీన వర్గాల అభివృద్ధి, సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని సిఎం స్పష్టం చేశారు. వారి స్మారకార్థం పలు కార్యక్రమాలు చేపట్టామని, తెలంగాణ ప్రభుత్వం ప్రతి యేడు కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి ఉత్సవాలను అధికారికంగా నిర్వహిస్తూ ఆయనకు నివాళి అర్పిస్తున్నదని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ప్రగతి ప్రస్థానమే కొండా లక్ష్మణ్ బాపూజీకి నిజమైన నివాళి అని సిఎం కెసిఆర్ అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News